సభ విజయమే బీఆర్‌ఎస్ విజయానికి సంకేతం: ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

by Bhanu |

బీఆర్‌ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల సందర్భంగా ఈ నెల 27న వరంగల్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని ఎల్బినగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కోరారు.

సభ విజయమే బీఆర్‌ఎస్ విజయానికి సంకేతం: ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
X

దిశ, చైతన్యపురి : బీఆర్‌ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల సందర్భంగా ఈ నెల 27న వరంగల్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని ఎల్బినగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కోరారు. హస్తినాపురం డివిజన్‌లో గురువారం నిర్వహించిన జెండా పండుగ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

నందనవనం వార్డు కార్యాలయం సమీపంలో, ఇంద్రసేనరెడ్డి నగర్, జెడ్పీ రోడ్డులో జరిగిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, పార్టీ విజయం కోసం ప్రతి కార్యకర్త చురుకుగా పాల్గొనాలని సూచించారు. ఎల్బినగర్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, ప్రజలు వరంగల్ సభకు తరలివచ్చి బీఆర్‌ఎస్ బలం చూపించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పద్మ శ్రీనివాస్ నాయక్, డివిజన్ అధ్యక్షులు సత్యంచారి, మహిళా అధ్యక్షురాలు ఆదిలక్ష్మి, గజ్జల మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story