- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BRS , Congress కార్యకర్తలు బాహాబాహి
వైఎస్సార్ నగర్ కాలనీలో ఫేస్ టు లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు లో అన్యాయం జరిగిందంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మంత్రి పువ్వాడ అజయ్ కాన్వాయ్ ని అడ్డుకున్నారు.

X
దిశ, ఖమ్మం సిటీ : వైఎస్సార్ నగర్ కాలనీలో ఫేస్ టు లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు లో అన్యాయం జరిగిందంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మంత్రి పువ్వాడ అజయ్ కాన్వాయ్ ని అడ్డుకున్నారు. దీంతో బీఆర్ ఎస్ పార్టీ కార్యకర్తల జోక్యంతో అక్కడ ఒకరిపై ఒక దాడులు చేసుకోవడం జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ దాడిలో ఇరు వర్గాలకు చిన్నపాటి గాయాలయ్యాయి. కానిస్టేబుల్ తలకు కూడా గాయం అవడంతో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు నానా తంటాలు పడాల్సి వచ్చింది. చివరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ విషయంపై స్పందిస్తూ అధికార పార్టీ వారు కావాలని తమ కార్యకర్తలపై దాడులు చేయించారంటూ ఆరోపించారు.
Next Story






