- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొత్త గ్యాస్ కనెక్షన్ల జారీకి బ్రేక్
ఇరాన్, ఇజ్రాయిల్ మద్య జరుగుతున్న యుద్ధం ఎఫెక్ట్ కొత్త గ్యాస్ కనెక్షన్లపై పడింది.

కొత్త గ్యాస్ కనెక్షన్ల జారీకి బ్రేక్
- ఆన్‌లైన్ దరఖాస్తులతో పాటు ఇప్పటికే బుక్ చేసుకున్నవి సైతం..
- 9 నెలలు గ్యాస్ బుక్ చేసుకోకపోతే కనెక్షన్ పోయినట్లే..
దిశ , హైదరాబాద్ బ్యూరో : ఇరాన్, ఇజ్రాయిల్ మద్య జరుగుతున్న యుద్ధం ఎఫెక్ట్ కొత్త గ్యాస్ కనెక్షన్లపై పడింది. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కొత్త గ్యాస్ కనెక్షన్ కావాలంటే ఎంపీ లెటర్ ద్వారా సిఫారసు చేయాల్సి ఉండేది. అయినా కొత్త కనెక్షన్లు మంజూరు కాకపోయేది. అయితే పరిస్థితులు మారి కొత్త కనెక్షన్లు తీసుకోవడాన్ని ఆయిల్ కంపెనీలు సులభతరం చేశాయి. కావాల్సిన ధ్రువ పత్రాలు తీసుకొని గ్యాస్ ఏజెన్సీలకు వెళ్తే కొత్త కనెక్షన్ మంజూరు చేయడంతో పాటు గ్యాస్ సిలిండర్‌ను వెంట తీసుకువెళ్లే సౌలభ్యం ఇటీవల వరకు ఉంది. తాజాగా ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ప్రభావం గ్యాస్, ఇతర పెట్రోలియం ఉత్పత్తులపై తీవ్రంగా చూపుతున్నది. ఆయిల్ కంపెనీలు నూతన కనెక్షన్లు ఇవ్వడం నిలిపివేశాయి. అంతేకాకుండా ఇప్పటికే కొత్త కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకొని పెండింగ్‌లో ఉన్న వాటిని కూడా రద్దు చేయడంతో నూతన కనెక్షన్ల జారీ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. తిరిగి ఎప్పుడు ప్రారంభం అవుతుందనే విషయంలో గ్యాస్ ఏజెన్సీల వద్ద ఎలాంటి సమాచారం లేదు.
ఆన్‌లైన్ దరఖాస్తులు సైతం..
కొత్త గ్యాస్ కనెక్షన్లు కావాలనుకునే వారు నేరుగా ఏజెన్సీల ద్వారా నేరుగా తీసుకోవడం, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే విధానం ఇప్పటి వరకు అమలులో ఉండేది. ఎల్పీజీ సరఫరాలో సమస్య కారణంగా గృహ, వాణిజ్య అవసరాల కోసం ఇచ్చే కొత్త కనెక్షన్ల మంజూరును ఆయిల్ కంపెనీలు నిలిపేశాయి. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియనూ ఆపేశాయి. ఇప్పటికే అందిన అప్లికేషన్లను సైతం పెండింగ్ పెట్టాయి. ‘మహాలక్ష్మి’ స్కీమ్ దరఖాస్తులదీ ఇదే పరిస్థితి. కంపెనీలు ఆమోదించకపోతుండడంతో ప్రభుత్వం కూడా వీటిని ఆపేసింది. యుద్ధం కారణంగా గ్యాస్ కొరత ఏర్పడటమే ఈ పరిస్థితికి కారణంగా అధికారులు పేర్కొంటున్నారు.
9 నెలలు బుక్ చేసుకోకపోతే..?
గ్యాస్ కనెక్షన్ ఉండి ఏదేని కారణంతో 9 నెలల పాటు గ్యాస్ రీఫిల్ బుక్ చేసుకోని వారి కనెక్షన్లు నిలిపివేస్తున్నారు. ఈ అకౌంట్లను సస్పెండ్ చేయడం, బ్లాక్ లిస్టులో పెట్టడం చేస్తున్నారు. పీఎన్జీ (పైప్డ్ నేచురల్ గ్యాస్) కనెక్షన్లు ఉన్నవారికి కూడా ఎల్‌పీజీ సిలిండర్లను ఆయిల్ కంపెనీలు నిలిపివేస్తున్నాయి. ఇప్పటికే పీఎన్జీ ఉన్న కుటుంబాలు ఎల్పీజీ కనెక్షన్లు సరెండర్ చేయాలని, 9 నెలలుగా సిలిండర్ బుక్ చేసుకోని కనెక్షన్లు కూడా రద్దు అవుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు చమురు కంపెనీలైన ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్పీ సీఎల్ ఇలాంటి చర్యలు చేపట్టాయి.
ఏజెన్సీల వద్ద నోటీస్ బోర్డుల ఏర్పాటు..
కొత్త ఎల్పీజీ కనెక్షన్ల మంజూరును నిలిపివేస్తున్నట్లు గ్యాస్ ఏజెన్సీలు గోడలపై నోటీసులు అంటిస్తున్నాయి. వినియోగదారులు కొత్త కనెక్షన్లు, గ్యాస్ బుకింగ్ కోసం ఏజెన్సీలకు వచ్చినా అక్కడున్న సిబ్బంది ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. గోడపై నోటీసులు అంటించాం.. అది చదువుకోండి.. అంటూ సమాధానం ఇస్తుండడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎల్పీజీ సరఫరాలో సమస్యతో గృహ, వాణిజ్య అవసరాల కోసం ఇచ్చే కొత్త కనెక్షన్ల మంజూరును ఆయిల్ కంపెనీలు నిలిపివేశాయి. ఇప్పటికే అందిన అప్లికేషన్లను సైతం పెండింగ్‌లో పెట్టాయి. మహాలక్ష్మి స్కీమ్ దరఖాస్తులదీ అదే స్థితి. కంపెనీలు ఆమోదించడంతో ప్రభుత్వం కూడా వీటిని ఆపేసింది, ఇరాన్, యూఎస్ యుద్ధంతో గ్యాస్ కొరత ఏర్పడడమే ఈ పరిస్థితికి కారణంగా అధికారులు పేర్కొంటున్నారని ఉన్న నోటీస్ బోర్డును ఏజెన్సీలు గోడలకు అంటించాయి. యుద్ధం ఎప్పుడు ఆగుతుందో..? గ్యాస్ సరఫరా ఎప్పుడు పాత స్థితికి చేరుకుంటుందోనని వినియోగదారులు ఎదురుచూస్తున్నారు.






