- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Hyderabad : ముగిసిన బాంబ్ స్క్వాడ్ తనిఖీలు.. ఉత్తిదే అని తేల్చిన పోలీసులు
హైదరాబాద్(Hyderabad)లో నేడు సిటీ సివిల్ కోర్టు(City Civil Court), జడ్జి ఛాంబర్స్(Judge Chambers), జింఖానా క్లబ్(Gymkhana Club), రాజ్‌భవన్(Raj Bhavan) వంటి నాలుగు ప్రాంతాల్లో బాంబు బెదిరింపు(Bomb Threats) మెయిల్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad)లో నేడు సిటీ సివిల్ కోర్టు(City Civil Court), జడ్జి ఛాంబర్స్(Judge Chambers), జింఖానా క్లబ్(Gymkhana Club), రాజ్‌భవన్(Raj Bhavan) వంటి నాలుగు ప్రాంతాల్లో బాంబు బెదిరింపు(Bomb Threats) మెయిల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు మూడు గంటల పాటు విస్తృత తనిఖీలు చేపట్టారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లతో కోర్టు ఆవరణ, ఇతర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించగా.. ఎటువంటి పేలుడు పదార్థాలు లభించలేదు. ఈ బెదిరింపులు 'అబీదా అబ్దుల్లా' పేరు గల మెయిల్స్ ద్వారా వచ్చాయి.
సిటీ సివిల్ కోర్టు, జడ్జి ఛాంబర్స్, జింఖానా క్లబ్ లో RDX, IEDలు పెట్టామని, కాసేపట్లో అవి పేలిపోతాయని మెయిల్స్ రాగా.. కోర్టు కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసి, లాయర్లు, ప్రజలను ఖాళీ చేయించారు. అనంతరం పోలీసుల బృందాలు 3 గంటలపాటు తనిఖీలు చేపట్టగా ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ బెదిరింపు మెయిల్స్ వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.






