గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం..

by Chukka Sudharani |   (  Updated:2022-12-01 16:00:29  IST  )

గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన చందానగర్ పొలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం..
X

దిశ, మియాపూర్: గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన చందానగర్ పొలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బుధవారం సాయంత్రం 6 గంటలకు ఫ్లాట్ ఫారమ్ నెం-6 లింగంపల్లి రైల్వే స్టేషన్‌ గేట్ దగ్గర సుమారు 55 సంవత్సరాల వయస్సు గల బిచ్చగాడు అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గుర్తించిన ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అతడిని పరిశీలించగా అప్పటికే మరణించినట్లు గుర్తించారు. మరణించిన వ్యక్తి చాక్లెట్ & తెలుపు కలర్ చారల షర్ట్, మెడలో గులాబీ కలర్ టవల్ ధరించి ఉన్నాడు. మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని, అనారోగ్య కారణాలతో మృతి చెంది ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు గుర్తు తెలియని వ్యక్తిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story