- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫిబ్రవరి 06 నుంచి బీఎంఎస్ అఖిల భారత మహాసభలు
ఫిబ్రవరి 06 నుంచి బీఎంఎస్ అఖిల భారత మహాసభలు నిర్వహించనున్నట్టు బీఎంఎస్ ఆలిండియా ఉపాధ్యక్షుడు ఎస్. మల్లేశం తెలిపారు.

దిశ, రాంనగర్ : ఫిబ్రవరి 06 నుంచి బీఎంఎస్ అఖిల భారత మహాసభలు నిర్వహించనున్నట్టు బీఎంఎస్ ఆలిండియా ఉపాధ్యక్షుడు ఎస్. మల్లేశం తెలిపారు. మంగళవారం ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని బీఎంఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫిబ్రవరి 6, 7, 8 తేదీల్లో ఒడిశా రాష్ట్ర పూరి నగరం నిర్వహించడం జరుగుతుందని బీఎంఎస్ ఆలిండియా ఉపాధ్యక్షుడు మల్లేశం తెలిపారు. దేశవ్యాప్తంగా 2500 మంది ప్రతినిధులు ఈ మహాసభలకు హాజరుకానున్నట్లు తెలిపారు. మహాసభలకు కేంద్రమంత్రి మనసుక్ మాండవియా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభిస్తారని వివరించారు. బ్రిక్స్ దేశాల నుంచి వచ్చే ప్రతినిధుల సదస్సును ఒడిస్సా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా కార్మికులు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం పై దృష్టి సారించడం జరుగుతుందన్నారు. దేశవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేయాలని, కేంద్ర రాష్ట్ర వివిధ స్కీం లలోపనిచేస్తున్న వారినీ. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అంశాలపై చర్చించడం జరుగుతుందన్నారు. ఈఎస్ఐ. రూ 21 వేల నుంచి రూ40 వేలకు పెంచాలి.. ఇతర పథకాల కు సీలింగ్ పెంచాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు కార్మిక చట్టాలపై కూడా సమావేశాల్లో చర్చించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాని కార్యదర్శి రాంరెడ్డి, జీహెచ్ఎంసీ బీఎంఎస్ ప్రధాన కార్యదర్శి టి.కృష్ణ పాల్గొన్నారు.






