- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెట్రోలో ప్రయాణించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు
నగర ప్రజలతో కలిసి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు మెట్రో రైలులో ప్రయాణించారు.

దిశ, సికింద్రాబాద్ : నగర ప్రజలతో కలిసి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు మెట్రో రైలులో ప్రయాణించారు. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునకు అనుగుణంగా తార్నాక నుంచి జూబ్లీ హిల్స్ వరకు మెట్రోలో ప్రయాణించి ప్రజా రవాణా వినియోగంపై ప్రత్యేక సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా రామచందర్ రావు మాట్లాడుతూ.. ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ, సహజ వనరుల బాధ్యతాయుత వినియోగం కోసం ప్రజలు ప్రజా రవాణా వ్యవస్థను ఎక్కువగా వినియోగించాలని కోరారు. కార్ల వినియోగాన్ని తగ్గించి మెట్రో, బస్సులు వంటి ప్రజా రవాణా సేవలను ఉపయోగించడం ద్వారా దేశ ఆర్థిక భారాన్ని తగ్గించవచ్చని అన్నారు.
మెట్రో ప్రయాణంలో సాధారణ ప్రయాణికుడిలా ప్రజలతో మమేకమైన ఆయన, ప్రయాణికులతో ఆప్యాయంగా మాట్లాడారు. ప్రధాని మోదీ సూచించిన బాధ్యతాయుత జీవన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించడం, ఎలక్ట్రిక్ వాహనాలు మరియు ప్రజా రవాణా వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అలాగే వోకల్ ఫర్ లోకల్ కార్యక్రమంలో భాగంగా స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దేశం కోసం.. భవిష్యత్తు కోసం.. మనందరి బాధ్యత అనే సందేశంతో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని బీజేపీ నేతలు తెలిపారు.






