- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
MLA Rajasingh : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మరోసారి బెదిరింపు కాల్స్
హైదరాబాద్(Hyderabad)లోని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే టి. రాజాసింగ్(BJP MLA Rajasingh)కు నేడు మరోసారి బెదిరింపు కాల్స్(Threat Calls) వచ్చాయి.

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad)లోని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే టి. రాజాసింగ్(BJP MLA Rajasingh)కు నేడు మరోసారి బెదిరింపు కాల్స్(Threat Calls) వచ్చాయి. తనను, తన కుటుంబాన్ని, ముఖ్యంగా తన కొడుకును కిడ్నాప్ చేసి చంపేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరించారని రాజాసింగ్ ఓ వీడియోలో పేర్కొన్నారు. అయితే ఈ కాల్స్ పై స్పందిస్తూ.. ఈ బెదిరింపులకు భయపడనని, దమ్ముంటే ఎదురుగా వచ్చి పోట్లాడాలని వారికి సవాల్ విసిరారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతా X ద్వారా పంచుకున్న రాజాసింగ్.. ఒక ఫోన్ సంభాషణ వీడియోను కూడా పోస్ట్ చేశారు.
కాగా ఈ మధ్య కాలంలో ఇలాంటి బెదరింపు కాల్స్, మెసేజెస్ ఎక్కువ అవడంతో.. భద్రతా సిబ్బందిని, బుల్లెట్ ప్రూఫ్ కారును ఉపయోగించుకోవాలని తెలంగాణ పోలీసులు(Telangana Police) అదివారం రాజాసింగ్ కు నోటీసులు జారీ చేశారు. భద్రతా కారణాల వల్ల ఒంటరిగా బయట తిరగొద్దని ఆయనకు విజ్ఞప్తి చేశారు.






