Breaking: చంద్రబాబుపై ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు

by srinivas |
Breaking: చంద్రబాబుపై ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు 53 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉండి మంగళవారం విడుదల అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చంద్రబాబు హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో ఉన్నారు. తన అరెస్ట్ దృష్ట్యా తెలంగాణ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడం లేదని ఇప్పటికే ప్రకటించారు. దీంతో టీడీపీ ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్ స్పందించారు. తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు వేలు పెడుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు కాంగ్రెస్‌ను గెలిపించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు జైలు నుంచి విడుదలైన తర్వాత కాంగ్రెస్‌ను పైకి లేపే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. 2018లో కాంగ్రెస్ పార్టీతో కలిసి తెర ముందు ప్రచారం చేశారని గుర్తు చేశారు. 2023లో కాంగ్రెస్ గెలుపునకు తెరవెనుక నుంచి చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.


Next Story

Most Viewed