ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న బీజేపీ చీఫ్ రామచంద్ర రావు

by Muthe.Rajitha |

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్ర రావు(Ramachandra Rao) ఆదివారం సాయంత్రం సికిందరాబాద్(Secundrabad) ఉజ్జయినీ మహంకాళి(Ujjaini Mahakali Bonalu) అమ్మవారిని దర్శించుకున్నారు.

ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న బీజేపీ చీఫ్ రామచంద్ర రావు
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్ర రావు(Ramachandra Rao) ఆదివారం సాయంత్రం సికిందరాబాద్(Secundrabad) ఉజ్జయినీ మహంకాళి(Ujjaini Mahakali Bonalu) అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీర్వాదంతోనే తాను ఇంత దూరం వచ్చానని అన్నారు. తెలంగాణ ప్రజలకు శాంతి, ఆయురారోగ్యాలు ప్రసాదించమని ప్రత్యేక పూజలు నిర్వహించినట్టు పేర్కొన్నారు. భక్తి, ఉత్సాహం, సంప్రదాయాల సౌరభంతో నిండిన బోనాల పండుగ జరుపుకుంటున్న ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అన్నారు. తెలంగాణ సంస్కృతి పరిరక్షణ, హిందూ సంప్రదాయాల గౌరవానికి బీజేపీ నిరంతరం కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఆలయాలపై దాడులు చేసేవారికి ప్రజాస్వామ్యబద్ధంగా సమాధానం చెబుతామని ఈ సందర్భంగా రామచంద్ర రావు వార్నింగ్ ఇచ్చారు.

Next Story