- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇన్ స్టాగ్రామ్ లో లైక్స్ కోసం బైకులు చోరీ
చోరీ బైక్ లతో స్టంట్ లు చేస్తూ సోషల్ మీడియాలో లైక్ ల కోసం దొంగతనాల బాట పట్టిన ముగ్గురితో పాటు ఓ మైనర్ ను హైదరాబాద్ సీసీఎస్, అబిడ్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.

దిశ, సిటీక్రైం : చోరీ బైక్ లతో స్టంట్ లు చేస్తూ సోషల్ మీడియాలో లైక్ ల కోసం దొంగతనాల బాట పట్టిన ముగ్గురితో పాటు ఓ మైనర్ ను హైదరాబాద్ సీసీఎస్, అబిడ్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ అత్తాపూర్ ఎంఎం పహాడ్ ప్రాంతానికి చెందిన మహ్మద్ రియాన్(18), సయ్యద్ అహ్మద్ అలీ (18), మహ్మద్ ఫర్దీన్(18), మైనర్ లు స్నేహితులు. వీరికి బైక్ లతో స్టంట్ లు చేయడం సరదాగా మారింది. దీంతో వీరందరూ బాలానగర్, గాంధీనగర్, కొల్లూరు, అత్తాపూర్ ప్రాంతాలలో రాత్రి సమయాల్లో తిరుగు ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్నారు. ఆ తర్వాత బైక్ లతో స్టంట్ లు చేస్తు ఇన్ స్టాగ్రామ్ లో పోస్టులు పెడుతూ లైక్ ల కోసం పోటీ పడుతున్నారు. ఇటీవల బైక్ ల చోరీలు పెరగడంతో సీసీఎస్ పోలీసులు ఫిర్యాదుల పై దృష్టి పెట్టారు. అందిన సమాచారంతో సీసీఎస్ పోలీసులు ఈ నలుగురి కదలికల పై నజర్ పెంచారు. పూర్తి ఆధారాలు లభించిన తర్వాత అదుపులోకి తీసుకుని విచారించగా.. స్టంట్ ల కోసం చోరీలకు పాల్పడుతున్నట్లు వివరించారు. స్టంట్ లు చేసిన తర్వాత ఆ బైక్ లను ఎంఎం పహాడ్ లోని నిర్మానుష్య ప్రాంతాల్లో ఈ బైక్ వదిలేసినట్లు గుర్తించి దాదాపు 10 బైక్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.






