- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలర్ట్.. దంచికొడుతున్న భారీ వర్షం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి

దిశ, వెబ్ డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనికి తోడు ఈశాన్య రుతుపవనాల కారణంగా తెలంగాణలో రెండు రోజుల నుంచి వివిధ జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారి.. తుఫానుగా రూపాంతరం చెందింది. దీంతో తెలంగాణలోని సూర్యాపేట, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అలాగే హైదరాబాద్ నగరంలో శనివారం ఉదయం నుంచి మబ్బులు కమ్ముకోగా.. మధ్యాహ్నం 2 గంటల నుంచి భారీ వర్షం కురవడం ప్రారంభించింది.
ప్రస్తుతం బంజారాహిల్స్, ఖైరతాబాద్, మసబ్ ట్యాంక్, లక్డీకపూల్, ట్యాంక్ బండ్, అమీర్ పేట్, హిమాయత్ నగర్, కోఠి, రామ్ నగర్, ముషిరాబాద్, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్, ఓయూ, బాగ్ లింగంపల్లి, గాంధీ నగర్, నల్లకుంట,అశోక్ నగర్, రాజేంద్ర నగర్, జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. అయితే ఇప్పటికే నగరం మొత్తం నల్లని మేఘాలు కమ్ముకోవడంతో మరికొద్ది గంటల్లో జీహెచ్ఎంసీ పరిధిలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కురుస్తున్న వర్షం కారణంగా ప్రధాన రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.






