Hyderabad Metro Rail : మెట్రో రైళ్లలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్... హైకోర్ట్ కీలక నిర్ణయం

by Muthe.Rajitha |

మెట్రో రైళ్లలో బెట్టింగ్ యాప్ ప్రకటనల(Betting Apps Pramotions Case)పై దాఖలైన పిల్(PIL) పై హైకోర్టులో విచారణ జరిగింది.

Hyderabad Metro Rail : మెట్రో రైళ్లలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్... హైకోర్ట్ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్ : మెట్రో రైళ్లలో బెట్టింగ్ యాప్ ప్రకటనల(Betting Apps Pramotions Case)పై దాఖలైన పిల్(PIL) పై హైకోర్టులో విచారణ జరిగింది. న్యాయవాది నాగూర్ బాబు దాఖలు చేసిన పిటిషన్ పై మంగళవారం హైకోర్టు(High Court) మరోసారి విచారణ జరిపింది. బెట్టింగ్ యాప్ లను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించినా మెట్రో రైళ్లHyderabad Metro Railలో మాత్రం ప్రకటనలు ఇస్తున్నారని పిటిషనర్ పేర్కోన్న అంశాలపై అడ్వకేట్ నాగూర్ బాబు వాదనలు వినిపించారు. కొన్ని బెట్టింగ్ యాప్స్ పై ఇప్పటికే ఈడీ విచారణ కొనసాగుతోందని, మెట్రో రైళ్లలో ప్రకటనలపైనా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కాగా హెచ్ఆర్ఎంఎల్ తరపున విచారణకు హాజరైన ఏజీ సుదర్శన్ రెడ్డి.. మెట్రో రైళ్లలో 2022 తర్వాత బెట్టింగ్ యాప్ పై ఎటువంటీ ప్రకటనలు ప్రదర్శించలేదని కోర్టుకు వివరించారు. ఇరువైపుల వాదనల అనంతరం తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది ధర్మాసనం.

Next Story