'ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి'

by Disha Web Desk 13 |
ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: సెల్ ఫోన్‌లో మాట్లాడుతూ ఎట్టి పరిస్థితులలో వాహనాలు నడవరాదని బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్సిట్యూట్ (టీటీఐ) ఏసీపీ జీ శంకర్ రాజు అన్నారు. ఈ మేరకు సోమవారం మారేడుపల్లి లోని సెంట్ మార్క్స్ హైస్కూల్, కాలేజ్ విద్యార్థులకు ఆయన ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిగ్నళ్ల వద్ద స్టాప్ లైన్ దాటి ముందుకు రావద్దని.. ట్రిబుల్, మైనర్ రైడింగ్ చేయరాదని సూచించారు. రోడ్లపై వాహనాలు నడిపే సమయంలో క్రమశిక్షణతో వ్యవహరించాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్ ఫోన్ డ్రైవ్, ఓవర్ స్పీడ్‌ల కారణంగా ప్రమాదాలు చోటు చేసుకుని విలువైన ప్రాణాలు పోతున్నాయని ఆయన అన్నారు.

కుటుంబంలో ఎవరైనా ఇలా యాక్సిడెంట్లలో చనిపోతే ఆ కుటుంబాలు పడే బాధ వర్ణనాతీతంగా ఉంటుందన్నారు. విద్యార్థులు ఇది అర్ధం చేసుకుని రోడ్లపై వెళ్లే సమయంలో ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. విద్యార్థులలో ఆత్మ విశ్వాసం ముఖ్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సీహెచ్ జ్యోతి, సిబ్బంది చక్రధర్, మజీద్, పాఠశాల కరస్పాండెంట్ శైలేందర్, కళాశాల ప్రిన్సిపాల్ గాయత్రి తదితరులు పాల్గొన్నారు.


Next Story