- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహాత్మ శ్రీ బసవేశ్వర చూపిన మార్గంలో నడవాలి : మంత్రి పొన్నం
సమాజంలో ఉన్న అనేక మూఢాచారాలను పారద్రోలి కులమత రహిత సమాజాన్ని నిర్మించడానికి కృషిచేసిన ప్రముఖ సంఘ సంస్కర్త శ్రీ బసవేశ్వర అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

దిశ, రాంనగర్ : సమాజంలో ఉన్న అనేక మూఢాచారాలను పారద్రోలి కులమత రహిత సమాజాన్ని నిర్మించడానికి కృషిచేసిన ప్రముఖ సంఘ సంస్కర్త శ్రీ బసవేశ్వర అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మహాత్మా శ్రీ బసవేశ్వర 892 వ జయంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద బుధవారం శ్రీ బసవేశ్వర విగ్రహానికి జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్ తో కలసి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమాజం పట్ల అవగాహన కల్పించిన మొదటి గురువు బసవేశ్వరుడు అని, బసవేశ్వరుడు జగత్ గురువుగా వారు చూపిన మార్గంలో నడుస్తూ సర్వేజనా సుఖినోభవంతు అందరూ బాగుండాలని,ప్రతిఒక్కరూ పరస్పరం గౌరవించుకుంటూ వారు ఇచ్చిన శాంతి సందేశం పాటించినట్లయితే ఎక్కడ ఉద్రిక్త వాతావరణలు ఉండదన్నారు.బసవేశ్వరుడి చరిత్ర తెలుసుకునే విధంగా ఉండాలని ఆకాంక్షిస్తూ బసవేశ్వరుడి జీవిత చరిత్ర ఈ తరానికి తెలవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ శాఖ ఎం.చంద్రశేఖర్,ఉప సంచాలకులు జి ఆశన్న, లింగాయతుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.






