- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > హైదరాబాద్ > ఇంగితజ్ఞానం లేని బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి : ఎమ్మెల్యే గోపీనాథ్ తీవ్ర విమర్శ
ఇంగితజ్ఞానం లేని బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి : ఎమ్మెల్యే గోపీనాథ్ తీవ్ర విమర్శ
ఇంగితజ్ఞానం లేని బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి ఎమ్మెల్యే గోపీనాథ్ తీవ్ర విమర్శ చేశారు.

X
దిశ, జూబ్లిహిల్స్ : ఇంగితజ్ఞానం లేని బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి ఎమ్మెల్యే గోపీనాథ్ తీవ్ర విమర్శ చేశారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ జూబ్లిహిల్స్ నియోజక వర్గంలోని రహ్మమత్ నగర్, ఎస్పీఆర్ హిల్స్ చౌరస్తా, షేక్ పేట్ లో ఎమ్మెల్యే గోపీనాథ్ ఆధ్వర్యంలో బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. బీజేపీ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ ఒక మహిళ పట్ల ఇంగిత జ్ఞానం లేకుండా అనుచిత వ్యాఖ్యలు చెయ్యటం తగదని, కవితకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సి.ఎన్.రెడ్డి , డివిజన్ అధ్యక్షులు మన్సూర్, సుబ్బరాజు, శ్రీనివాస్, నాయకులు నాగరాజు, షరీఫ్, నజీర్, రవిశంకర్, దనుజ, నందు, గని, జఫ్ఫార్, జగన్, విలియం తదితరులు పాల్గొన్నారు.
Next Story






