- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎంపీ రఘునందన్ రావును పరామర్శించిన బండి సంజయ్
మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావును కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పరామర్శించారు.

X
దిశ, వెబ్ డెస్క్, రాజేంద్రనగర్ : మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావును కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పరామర్శించారు. ఇటీవలే రఘునందన్ రావు కాలుకు శస్త్ర చికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. ఆరోగ్య పరిస్థితి కుదుట పడటంతో గురువారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి మణికొండలోని తన నివాసానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ఆయన ఇంటికి చేరుకొని పరామర్శించారు. హెల్త్ గురించి అడిగి తెలుసుకున్నారు. జాగ్రత్తగా ఉండాలని బండి సంజయ్ ఆకాంక్షించారు.
Next Story






