- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో దారుణం.. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని .. కుంట్లూరు తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ గర్ల్స్హాస్టల్లో ఆదివారం ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.

దిశ, వనస్థలిపురం: హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని .. కుంట్లూరు తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ గర్ల్స్హాస్టల్లో ఆదివారం ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లా.. కొండనాగుల మండలం.. అంబగిరి గ్రామానికి చెందిన ఉడత నూరి శివశంకర్ కుమార్తె సౌమ్య(17) ఇంటర్ సెకండియర్ చదువుతోంది. సాయంత్రం 7 గంటల సమయంలో తోటి విద్యార్థినిలు డిన్నర్ చేసేందుకు వెళ్లగా తరగతిదిలోకి వెళ్లి తన చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన తోటి విద్యార్థిని కాలేజీ హాస్టల్ ప్రిన్సిపాల్ కమ్ వార్డెన్ విజయలక్ష్మి సమాచారం ఇచ్చేందుకు వెళ్లగా అందుబాటులో లేకపోవడంతో వెంటనే కిందికి దించింది. అనంతరం ప్రిన్సిపాల్, వార్డెన్ విజయలక్ష్మికి సమాచారం ఇవ్వడంతో వచ్చి దగ్గరలోని ఓ ప్రైవేట్‌ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. డెడ్‌బాడీనీ పోస్ట్‌మార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించామని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాగరాజుగౌడ్ తెలిపారు.
గతంలోనూ ఆత్మహత్యాయత్నం
ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణం కావొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. విద్యార్థిని సౌమ్య నోట్‌బుక్‌లను పరిశీలిస్తే.. ప్రేమకు సంబంధించిన విషయాలు రాసుకున్నట్లు గుర్తించారు. గతంలోనూ ఇదే హాస్టల్లో ఆత్మహత్యకు యత్నించగా, కాపాడినట్లు, అనంతరం ప్రిన్సిపాల్ తల్లిదండ్రులను పిలిపించి వారి సమక్షంలో మందలించి లెటర్రాయించుకున్నారని చెప్తున్నారు.






