- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్రిస్మస్, న్యూ ఇయర్ వేళ.. పోలీసుల కీలక హెచ్చరిక
దిశ, సిటీక్రైం : క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్బంగా ప్రజలను దోచుకునేందుకు సైబర్ నేరగాళ్లు కాచుకుని ఉంటారని

దిశ, సిటీక్రైం : క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్బంగా ప్రజలను దోచుకునేందుకు సైబర్ నేరగాళ్లు కాచుకుని ఉంటారని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు. గుర్తు తెలియని వారి నుంచి వచ్చే ఎస్ఎంఎస్ లు, వాట్సాప్ లలోని మెసెజ్ లు, లింక్ ల జోలికి వెళ్ళొద్దని సూచిస్తున్నారు. ముఖ్యంగా పండుగల వేళ డిస్కౌంట్ లు, లాటరీలు, గిఫ్ట్ లంటూ, భారీ ఆఫర్ లన్ని బురిడి కొట్టిస్తారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కాబట్టీ ప్రజలు సోషల్ మీడియా వేదికగా జరిగే మోసాల పట్ల అలర్ట్ గా ఉండాలని పేర్కొంటున్నారు.
మిమ్మల్ని ఆర్ధికంగా దోచుకునే సైబర్ మోసాలు ఇలా
- మీరు న్యూ ఇయర్, క్రిస్ట్ మస్ గిఫ్ట్ లు గెల్చుకున్నారు. మీకు ఫారిన్ లాటరీ నగదును గెల్చుకున్నారు. క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉందని మెసేజ్ లు , లింక్ లు పంపిస్తారు. ప్రాసెసింగ్ ఫీజులు చెల్లించాలని కోరుతారు.
- న్యూ ఇయర్ పార్టీ పేరుతో పేరొందిన పబ్స్, రిసార్టస్ పేర్లతో నకిలీ టికెట్ లు, పాసులు విక్రయిస్తారు. దీని కోసం ఫేక్ వెబ్ సైట్స్, పేజీలను రూపొందిస్తారు.
- షోషల్ మీడియా వేదికగా అతి తక్కువ ధరలకే అంతర్జాతీయ టూర్ లు, హాలీడే, ప్యాకేజీలు, ఆధ్యాత్మిక యాత్రలంటూ , క్రూజ్ షికార్లు అని అడ్వాన్సు లు అడుగుతారు. ఆ తర్వాత మాయమవుతారు.
- న్యూ ఇయర్ వేడుకలను దృష్టి లో పెట్టుకుని పేరొందిన హోటల్స్, రిసార్ట్స్ తదితర టూరిస్ట్ ప్రాంతాలలో అతి తక్కువ ఖర్చు తో స్టే అంటూ సోషల్ మీడియా వేదికల మీదుగా నకిలీ వెబ్ సైట్ లు, పేజీలను రూపొందించి అడ్వాన్స్ లను వసూలు చేస్తారు.
- న్యూ ఇయర్ పార్టీల సందర్భంగా కారు, బైక్ , కారు రెంటల్ సర్వీసెస్ అంటూ బుకింగ్ ల కోసం ముందస్తుగా డబ్బులు చెల్లించాలని ఆఫర్ లు ఇస్తారు.
- క్రిస్టమస్ సందర్భంగా పేదలకు, అనాథలకు లేదా చర్చిలకు డొనేషన్ లు అంటూ మాయ చేస్తారు.
- క్రిస్ట్ మస్ సందర్భంగా ఈవెంట్ లు, మాస్ ఎంట్రీ పాసులు , స్పెషల్ ఈవెంట్ రిజిస్ట్రేషన్స్ అంటూ ప్రకటనలను సోషల్ మీడియాలో గుప్పిస్తారు.
- హోటల్ సర్వీసెస్, ఈవెంట్ మేనేజ్ మెంట్, ప్రమోషన్ ప్రోగ్రామ్స్ ల పేరుతో ఉద్యోగాలంటూ ఊరిస్తారు.
- న్యూ ఇయర్ సందర్భంగా క్యాష్ బ్యాక్ ఆఫర్ లు, బోనస్ లు, రివార్డు పాయింట్ లంటూ ఆశ పుట్టిస్తారు.
ఎలాంటి ప్రకటనలు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చినప్పుడు అసలు నమ్మోద్దు. వాటిని క్లిక్ చేయొద్దు. ఎవరీకి ఓటీపీలు, పాస్ వర్డులు చెప్పొద్దు. ఏపీకే ఫైల్స్ ను ఓపెన్ చేయొద్దు. అనుమానం రాగానే వాటిని డిలిట్ చేయాలి. మీరు అప్రమత్తంగా ఉంటూ సైబర్ నేరగాళ్లకు చెక్ పెట్టాలని పోలీసులు కోరుతున్నారు.






