4 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి...నిందితుడికి జీవిత ఖైదు

by velandi.Saikiran |

నాలుగేండ్ల చిన్నారి పై లైంగిక దాడికి పాల్పడ్డ నిందితుడికి బుధవారం జీవిత ఖైదు శిక్షను విధిస్తు తీర్పు వెల్లడించింది

4 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి...నిందితుడికి జీవిత ఖైదు
X

దిశ, సిటీక్రైం : నాలుగేండ్ల చిన్నారి పై లైంగిక దాడికి పాల్పడ్డ నిందితుడికి బుధవారం జీవిత ఖైదు శిక్షను విధిస్తు తీర్పు వెల్లడించింది మల్కాజిగిరి పోక్సో కోర్టు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం...2021 జూలై 4 వ తేదిన దమ్మాయిగూడ వెంకటేశ్వరనగర్ కాలనీలో కిరాణ దుకాణానికి నాలుగేళ్ల‌ బాలిక వెళ్లింది. అదే సమయంలో ఒడిశా నుంచి వ‌చ్చి జవహార్ నగర్ లో కూలీగా పని చేస్తున్న అభిరామ్ దాస్ బాలికపై క‌న్నేశాడు. ఆమెను కిడ్నాప్ చేసి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది.

సంఘటన పై జవహార్ నగర్ పోలీసులు పోక్సోతో పాటు మరికొన్ని సెక్షన్ ల కింద కేసును నమోదు చేసి దర్యాప్తు చేశారు. పూర్తి ఆధారాలు సేకరించి నిందితుడికి శిక్ష పడేలా కోర్టు ముందుకు తీసుకెళ్లారు. విచారణను చేపట్టిన కోర్టు ఆధారాలను పరిశీలించి నిందితుడు అభిరామ్ దాస్ కు జీవిత ఖైదు శిక్షను ఖరారు చేసింది. 60 వేల జరిమానాను విధించింది. బాధిత బాలికకు 5 లక్షల పరిహారాన్ని అందించాలని న్యాయమూర్తి తీర్పును ఇచ్చారు. ఈ కేసు దర్యాప్తు, కోర్టు విచారణలో కీలకంగా వ్యవహరించిన అప్పటి కుషాయిగూడ ఏసీపీ శివకుమార్, జవహార్ నగర్ పీఎస్ కానిస్టెబుల్ భాను చందర్, స్పెషల్ పీపీ విజయ్ రెడ్డి, అదనపు పీపీ శ్యాంరావు, తదితర ఆఫీసర్ లను పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.

Next Story