హెచ్జీఏ కెప్టెన్ కప్-2023 విజేతగా అశ్రయ్ రెడ్డి

by Satheesh |

హైదరాబాద్ గోల్ప్ అసోసియేషన్ (హెచ్జీఏ) కెప్టెన్ కప్-2023ను పరిపాటి అశ్రయ్ రెడ్డి సొంతం చేసుకున్నారు. 15వ ఎడిషన్ కప్ విజేతగా నిలిచారు.

హెచ్జీఏ కెప్టెన్ కప్-2023 విజేతగా అశ్రయ్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ గోల్ప్ అసోసియేషన్ (హెచ్జీఏ) కెప్టెన్ కప్-2023ను పరిపాటి అశ్రయ్ రెడ్డి సొంతం చేసుకున్నారు. 15వ ఎడిషన్ కప్ విజేతగా నిలిచారు. ఈ నెల 7 నుంచి 10వ తేదీవరకు నాలుగు రోజుల పాటు గోల్ఫ్ టోర్నమెంట్‌ హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్‌లో జరిగింది. ఈ టోర్నమెంట్‌లో 399 మంది గోల్ప్ క్రీడాకారులు పాల్గొన్నారు. బాట్ల్ ప్రిలిమినరీ మరియు ఫైనల్ రౌండ్‌లో మొత్తం ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుని విజేతను ప్రకటిస్తారు. ఈ ఫ్లాగ్‌షిప్ ఈవెంట్‌లో అశ్రయ్ రెడ్డి మొదటి రౌండ్‌లో 86 (అండర్ 2) మరియు చివరి రౌండ్‌లో అసాధారణమైన (అండర్ 6) స్కోర్ సాధించి విజేతగా నిలిచారు. ఆశ్రయ్ రెడ్డి 8 ఏళ్ల నుంచి గోల్ఫ్ ఆడుతున్నారు. యూఎస్ కిడ్స్ గోల్ఫ్ - ఇండియా టూర్-2019లో కాంస్య పతకంతో సహా అనేక పతకాలను గెలుచుకున్నారు.

Next Story