- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Hyderabad : హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మికి మరో షాక్
హైదరాబాద్ నగర మేయర్(Hyderabad Mayor) గద్వాల విజయలక్ష్మి(Gadwala Vijayalakshmi)కి మరో భారీ షాక్ తగిలింది.

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నగర మేయర్(Hyderabad Mayor) గద్వాల విజయలక్ష్మి(Gadwala Vijayalakshmi)కి మరో భారీ షాక్ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు(K Keshavarao) కుటుంబ సభ్యులకు సంబంధించిన స్థలాల క్రమబద్ధీకరణపై బుధవారం తెలంగాణ హైకోర్టు(Telangana High Court)లో ప్రజాప్రయోజన వ్యాజ్యం(PIL) దాఖలైంది. రఘువీరా రెడ్డి అనే వ్యక్తి ఈ పిల్ ను దాఖలు చేశారు. బంజారాహిల్స్ లోని ఎన్బీటీ నగర్లో ఉన్న విలువైన భూములను జీవో నెం.56 ద్వారా కేటాయించారని పిటిషనర్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ కేసులో కేశవరావు కూతురు, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, జీపీఏ హోల్డర్ కవిత, రెవెన్యూ అధికారులను ప్రతివాదులుగా చేర్చారు. వారికి కేటాయిస్తూ జారీ చేసిన జీవోను రద్దు చేస్తూ, ఆ భూమిని ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని పిటిషనర్ కోరారు.
ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్(Justice Sujoy Paul) విచారణ చేపట్టారు. అయితే కౌంటర్ దాఖలు చేయడానికి ప్రతివాదుల తరపున న్యాయవాదులు కొంత గడువు కోరారు. దీంతో తదుపరి విచారణను వచ్చేనెల 27కు వాయిదా వేసింది హైకోర్ట్. కాగా కాంగ్రెస్ ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, ఆయన కుమార్తె గద్వాల విజయలక్ష్మి గత ప్రభుత్వంలో ఇవే పదవుల్లో కొనసాగారు. ప్రస్తుతం ఈ భూములు అప్పటి ప్రభుత్వం జారీ చేసిన జీవోల ద్వారా ఇవ్వబడినవే. ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత తండ్రీ కూతుళ్ళు అధికారిక పార్టీలోకి మారిపోవడంతో.. ప్రతి పక్ష పార్టీలు ఎలాగైనా వీరిని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నాయని రాజకీయ విమర్శకులు పేర్కొంటున్నారు.






