Rafale Fighter Jet Flights :హైదరాబాద్‌ కు మరో ప్రతిష్టాత్మక కంపెనీ.. రాఫెల్ యుద్ధ విమాన భాగాల యూనిట్

by Muthe.Rajitha |   (  Updated:2025-06-05 10:40:15  IST  )

తెలంగాణ రాజధాని హైదరాబాద్(Hyderabad) నగరానికి మరో ప్రతిష్టాత్మక కంపెనీ రాబోతోంది.

Rafale Fighter Jet Flights :హైదరాబాద్‌ కు మరో ప్రతిష్టాత్మక కంపెనీ.. రాఫెల్ యుద్ధ విమాన భాగాల యూనిట్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాజధాని హైదరాబాద్(Hyderabad) నగరానికి మరో ప్రతిష్టాత్మక కంపెనీ రాబోతోంది. భారత్‌లో నెలకొల్పబోయే రాఫెల్‌ యుద్ధ విమాన(Rafale Fighter Jet Flights) భాగాల ఉత్పత్తి యూనిట్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం అయింది. టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్(TASL), డసాల్ట్ ఏవియేషన్(Dassault Aviation) కలిసి రాఫెల్ యుద్ధ విమానాల ఫ్యూజ్‌లేజ్(Fighter Aircraft Fuselage) తయారీ కోసం నాలుగు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో అతి పెద్ద ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. ఇది ఫ్రాన్స్ బయట రాఫెల్ ఫ్యూజ్‌లేజ్‌లు తయారయ్యే తొలి యూనిట్ గా గుర్తింపు పొందనుంది. ఈ ఉత్పత్తి కేంద్రం 2028 నుంచి రాఫెల్ విమానాలకు కావాల్సిన లాటరల్ షెల్స్, సెంట్రల్, ఫ్రంట్ సెక్షన్‌లను తయారు చేస్తుంది. నెలకు రెండు ఫ్యూజ్‌లేజ్‌ల వరకూ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంటుంది.

ఈ ప్రాజెక్ట్ 'మేక్ ఇన్ ఇండియా'(Make In India), ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యాల మేరకు ఏర్పాటు అవుతోంది. భారత్‌ను ప్రపంచ ఏరోస్పేస్ సరఫరా చెయిన్ లో కీ ప్లేయర్ గా మార్చనుంది. అలాగే స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ ఉద్యోగాలను కూడా కల్పిస్తుంది. శ్రామికుల నైపుణ్యాలను పెంచుతుంది. డసాల్ట్‌తో ఈ భాగస్వామ్యం భారత్‌తో 70 ఏళ్ల సంబంధాన్ని మరింత బలపరచనుంది. రాఫెల్ ఉత్పత్తిని మరింత వేగవంతం చేస్తుందని డసాల్ట్ CEO ఎరిక్ ట్రాపియర్ తెలపగా.. ఈ ఒప్పందం భారత ఏరోస్పేస్ రంగంలో మైలురాయిగా నిలుస్తుందని TASL CEO సుకరన్ సింగ్ పేర్కొన్నారు. ఈ యూనిట్ కేవలం భారత్ కోసమే కాక ప్రపంచ మార్కెట్‌లకూ కూడా యుద్ధ విమాన విడి భాగాలను సరఫరా చేయనుంది.

Next Story