జూబ్లీహిల్స్ పోరులో ఉన్నాను : అంజన్ కుమార్ యాదవ్

by Muthe.Rajitha |

కాంగ్రెస్ సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్(Anjan Kumar Yadav) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

జూబ్లీహిల్స్ పోరులో ఉన్నాను : అంజన్ కుమార్ యాదవ్
X

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్(Anjan Kumar Yadav) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల(Jubilee Hills by-election) రేసులో తాను కూడా ఉన్నానని పేర్కొన్నారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్నపుడు టికెట్ ఎందుకు ఆశించకూడదు అని ప్రశ్నించారు. తన కుమారుడు కష్టపడి ఎంపీ అయ్యాడని, ఊరికే తనకి టికెట్ ఇవ్వలేదని అన్నారు. తెలంగాణాలో బీసీ సామాజిక వర్గం నుంచి తాను జూబ్లీహిల్స్ టికెట్ ఆశిస్తున్నానని తెలిపిన అంజన్ కుమార్ యాదవ్... తమ ఇంట్లో తండ్రీ కొడుకులం పార్టీకి సేవ చేస్తుంటే జీతం మాత్రమే ఒక్కరికే ఇస్తున్నారని విమర్శించారు. పీసీసీ అధ్యక్ష పదవి కోసం జరిగిన చర్చల్లో తనకు అన్యాయం చేయమని అధిష్టానం మాట ఇచ్చిందని, ఇపుడు దానిని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేసారు.

Next Story