హ‌య‌త్ న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ కి గుర్తు తెలియ‌ని బాలుడు

by Ratna Kumari |

హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని బాలుడు సంచరిస్తుండగా.. పోలీసులు పోలీస్​ స్టేషన్​కు తీసుకువచ్చారు.

హ‌య‌త్ న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ కి గుర్తు తెలియ‌ని బాలుడు
X

దిశ, వనస్థలిపురం : హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని బాలుడు సంచరిస్తుండగా.. పోలీసులు పోలీస్​ స్టేషన్​కు తీసుకువచ్చారు. సీఐ నాగరాజ్​ గౌడ్​ వివరాల ప్రకారం.. ఆదివారం ఉద‌యం 9 గంటల సమయంలో హయత్‌నగర్ ప్రాంతంలో సుమారు 12 సంవ‌త్స‌రాల వయస్సు గల మల్లేష్ అనే బాలుడు ఒంటరిగా సంచరిస్తూ కనిపించాడు. పోలీసులు బాలుడిని విచారించగా.. తన ఇంటి చిరునామా, తల్లిదండ్రుల వివరాలు చెప్పలేకపోయినట్లు తెలిపారు. బాలుడి భద్రత, సంరక్షణ దృష్ట్యా అతడిని హైదరాబాద్ సైదాబాద్‌లోని బాలుర బాలల గృహానికి తరలించినట్లు సీఐ వెల్లడించారు. బాలుడిని పలుమార్లు ప్రశ్నించగా.. మేడిపల్లి ప్రాంతంలోని ఓ కాలనీ పేరు చెప్పడంతో.. అక్కడ పోలీసులు పంపి బాలుడి ఫొటోతో ఆరా తీస్తున్నట్లు తెలిపారు. ఈ బాలుడి గురించి లేదా అతని కుటుంబ సభ్యుల వివరాలు తెలిసిన వారు వెంటనే హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌ 8712662640 నంబర్లో సంప్రదించాలని సీఐ నాగరాజ్​ గౌడ్​ విజ్ఞప్తి చేశారు.

Next Story