జూబ్లీహిల్స్‌లో సర్వేలన్నీ కాంగ్రెస్ వైపే..?

by Kodari Anjali |   (  Updated:2025-11-11 14:12:35  IST  )

జూబ్లీహిల్స్ బై పోల్ అనంతరం పలు సంస్థలు ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ అధికార పార్టీకే పట్టం కట్టేలా ఉన్నాయి.

జూబ్లీహిల్స్‌లో సర్వేలన్నీ కాంగ్రెస్ వైపే..?
X

దిశ, హైదరాబాద్ బ్యూరో: జూబ్లీహిల్స్ బై పోల్ అనంతరం పలు సంస్థలు ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ అధికార పార్టీకే పట్టం కట్టేలా ఉన్నాయి. చాణక్య స్ట్రాటజీస్‌ తో సహా ఇతర సంస్థలు చేపట్టిన సర్వేలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని స్పష్టం చేయడంతో పార్టీ శ్రేణుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఇక్కడ బీఆర్ఎస్ రెండవ స్థానంలో, బీజేపీ మూడవ స్థానంతోనే సరిపెట్టుకోనుందని సర్వేలు వెల్లడించాయి . ఎన్నికకు ముందు మాగంటి గోపీనాథ్ మీద ఉన్న సింపతి పని చేసి ఆయన సతీమణి మాగంటి సునీత గెలుస్తుందని అంచానాలు వేశారు . అయితే అందరి అంచనాలు తప్పే విధంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఉన్నాయి. దాదాపు సర్వేలన్నీ కాంగ్రెస్ వైపే చూపిస్తున్నాయి .

టఫ్ ఫైట్...

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీదే గెలుపుగా సర్వేల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి . అయితే బీఆర్ఎస్ అభ్యర్థి నుండి గట్టి పోటీ ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ లో పేర్కొన్నారు. మొత్తం మీద అనేక సర్వే సంస్థలు ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. . ఈ సస్పెన్స్ కు తెరదించే కౌంటింగ్ రోజు నవంబర్ 14వ తేదీ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ మినహా బీఆర్ఎస్, బీజేపీతో సహా బరిలో ఉన్న ఇతర నాయకులలో గెలుపు ధీమా పోయి టెన్షన్‌కు గురౌతున్నారు .

సర్వే ఇలా చెబుతున్నాయి...

చాణక్య స్ట్రాటజీస్ కాంగ్రెస్ 46 శాతం , బీఆర్ఎస్ 43 శాతం , బీజేపీ 6 శాతం , స్మార్ట్ పోల్ కాంగ్రెస్ 48.2 శాతం , బీఆర్ఎస్ 41 శాతం , బీజేపీ 6 శాతం, ఆత్మసాక్షి కాంగ్రెస్ 46.5 శాతం , బీఆర్ఎస్ 44.5 శాతం , బీజేపీ 6.5 శాతం, పీపుల్ పల్స్ కాంగ్రెస్ 46 శాతం, బీఆర్ఎస్ 41 శాతం, బీజేపీ 6 శాతం , హెచ్ఎంఆర్ సర్వే కాంగ్రెస్ 48.3 శాతం , బీఆర్ఎస్ 43.18 శాతం , బీజేపీ 5.84 శాతం.

Read More... మా సక్సెస్‌‌కు కారణం అవే.... ఎగ్జిట్ పోల్స్‌పై మహేశ్ కుమార్ గౌడ్ స్పందన

Next Story