- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నగర ప్రజలకు బ్యాడ్ న్యూస్.. పండుగ రోజు ఆ దుకాణాలు బంద్
by Naga Rani Yarlagadda |
నగర ప్రజలకు, నాన్ వెజ్ ప్రియులకు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) షాకిచ్చింది.

X
దిశ, వెబ్‌డెస్క్: నగర ప్రజలకు, నాన్ వెజ్ ప్రియులకు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) షాకిచ్చింది. అక్టోబర్ 2న దసరా పండుగ కాగా.. ఆ రోజే గాంధీ జయంతి కూడా కావడంతో జీహెచ్ఎంసీ పరిధిలో మాంసం దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్ఎంసీ చట్టం 1955లోని విభాగం 533(B)తో పాటు ఈనెల 24న జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆమోదించిన 172వ తీర్మానం ఆధారంగా ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది. ఇందుకు అధికారులు సహకరించాలని, మాంసం దుకాణాలు తెరువకుండా పర్యవేక్షణ చేపట్టి.. గాంధీజీ పవిత్రతను కాపాడాలని సూచించింది. దీంతో పండుగ రోజున ఇదేంటంటూ కొనుగోలుదారులు వాపోతున్నారు. గాంధీ జయంతి రోజే పండుగ రావడంతో మాంసం దుకాణాలు మూసివేయడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Next Story






