అంబర్పేట్ లోని జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఏసీబీ రైడ్స్.. పట్టుబడ్డ ఇంజనీరింగ్ ఏఈ మనీషా

by Bhanu |

అంబర్‌పేట జోన్‌కు చెందిన జీహెచ్ఎంసీ గోల్నాక సర్కిల్ కార్యాలయంలో పనిచేస్తున్న అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) మనీషా లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది.

అంబర్పేట్ లోని జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఏసీబీ రైడ్స్.. పట్టుబడ్డ ఇంజనీరింగ్ ఏఈ మనీషా
X

దిశ, అంబర్‌పేట: అంబర్‌పేట జోన్‌కు చెందిన జీహెచ్ఎంసీ గోల్నాక సర్కిల్ కార్యాలయంలో పనిచేస్తున్న అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) మనీషా లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది. నెహ్రూ నగర్‌లోని వార్డు నంబర్-2లో విధులు నిర్వహిస్తున్న ఆమె, కాంట్రాక్టర్ నుంచి బిల్లులను ప్రాసెస్ చేసి పై అధికారులకు పంపేందుకు రూ. 20,000 లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు.

ఇప్పటికే రూ. 5,000 తీసుకున్న ఈఏఈ, మిగతా రూ. 15,000 కూడా ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో బాధిత కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించాడు. ఈ క్రమంలో హైదరాబాద్ ఏసీబీ యూనిట్ ప్రత్యేకంగా పన్నిన వ్యూహం మేరకు, మనీషా రూ.15,000 తీసుకుంటున్న సమయంలో దొరికిపోయింది. ఘటనాస్థలిలో నుంచే ఆమెను అరెస్టు చేసిన అధికారులు, లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆమెను అరెస్టు చేసిన అనంతరం నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

Next Story