- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇండస్ట్రీ జోలికి రావొద్దు: శివబాలాజీ మాస్ వార్నింగ్
రాజకీయ నాయకులు ఇండస్ట్రీ జోలికి రావొద్దని నటుడు, ‘మా’ ట్రెజరర్ శివబాలాజీ అన్నారు

దిశ, వెబ్ డెస్క్: రాజకీయ నాయకులు ఇండస్ట్రీ జోలికి రావొద్దని నటుడు, ‘మా’ ట్రెజరర్ శివబాలాజీ( Maa Treasurer Shivabalaji) అన్నారు. అనంతపురం మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై మాధవీలత ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకలు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. వ్యక్తిగత జీవితాలపై మాట్లాడడం సరికాదన్నారు. రాజకీయ నాయకులు ఇండస్ట్రీ జోలికి రావొద్దన్నారు. మాధవీలత ఫిర్యాదుపై కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ‘మా’ ట్రెజరర్ శివబాలాజీ తెలిపారు.
జరిగిందిదీ..
డిసెంబర్ 31 సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి(Jc Prabhakar Reddy) అనంతపురం జిల్లా తాడిపత్రి(Tadipatri) జేసీ పార్క్‌లో న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు మహిళలను మాత్రమే ఆహ్వానిస్తూ ఇన్విటేషన్లు పంపారు. దీంతో మాధవీలత(Madhavi Latha) స్పందించారు. ఆ వేడుకలకు వెళితే మహిళలకు భద్రత ఉండదని, ఏదైనా జరిగితే బాధ్యత ఎవరిదంటూ వీడియోలో మాట్లాడి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోపై జేసీ ప్రభాకర్ రెడ్డి సీరియస్ అయ్యారు. మాధవీలతపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. దీంతో జేసీపై మాధవీలతతో పాటు బీజేపీ నాయకులు, సన్నిహితుల నుంచి విమర్శలు వినిపించాయి. ఈ మేరకు జేసీ ప్రభాకర్ రెడ్డి వెనక్కి తగ్గారు. మాధవీలతకు క్షమాపణలు చెప్పారు. అయితే ఆయన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న ఆమె తాజాగా హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లో మా అసోసియేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో మా ట్రెజరర్ శివబాలాజీ స్పందించారు. ఎవరూ సరై ఫిల్మ్ ఇండస్ట్రీ జోలికి మాత్రం రావొద్దని హెచ్చరించారు.






