- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైపర్,సెన్సిటివ్ ప్రాంతాల్లో ఎక్కువ దృష్టి సారించాలి
గణేష్ నిమజ్జనాల నేపథ్యంలో హైపర్, సెన్సిటివ్ ప్రాంతాల్లో ఎక్కువ దృష్టి సారించాలని ఏసిపి ఎల్ రమేష్ పోలీసులకు

దిశ, రాంనగర్: గణేష్ నిమజ్జనాల నేపథ్యంలో హైపర్, సెన్సిటివ్ ప్రాంతాల్లో ఎక్కువ దృష్టి సారించాలని ఏసిపి ఎల్ రమేష్ పోలీసులకు సూచించారు. హైదరాబాద్, ముషీరాబాద్ లోని కశీష్ ఫంక్షన్ హాల్ లో బుధవారం గణేష్ నిమజ్జనం ఏర్పాట్లపై జరిగిన సమావేశంలో పోలీస్ అధికారులకు దశ దిశ నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ రమేష్ మాట్లాడుతూ గణేష్ నిమజ్జనానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా జరిగేలా విధులు నిర్వహించాలని కోరారు.
అలాగే మండపాల వద్ద కరెంటు స్తంభాలపై దృష్టి పెట్టాలని, అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించాలన్నారు. అనంతరం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్,సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి ఆదేశాల మేరకు ఎసిపి, ముషీరాబాద్, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ
జి.రాంబాబు,బి.రాజునాయక్, ఆధ్వర్యంలో ముషీరాబాద్ లోని పఠాన్ బస్తి, భోలక్పూర్, రాంనగర్,చిక్కడపల్లి, అంబేద్కర్ నగర్ కాలేజ్, బాగ్లింగంపల్లి ఎక్స్ రోడ్, సుందర విజ్ఞాన పార్క్, గోల్కొండ ఎక్స్ రోడ్ పరిసర ప్రాంతాల్లో పోలీస్ సిబ్బంది ప్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలోముషీరాబాద్ పోలీస్ స్టేషన్ల డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ లు ఎండి నదీమ్ హుస్సేన్, ఎం .శంకర్ ఎస్సైలు లక్ష్మీనారాయణ, నస్రిన్, దుర్గాప్రసాద్, రాజేష్, అభిలాష్,మౌనిక పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.






