Sandhya Theater Incident : ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు : బన్నీకి ఏసీపీ మాస్ వార్నింగ్

by Muthe.Rajitha |   (  Updated:2024-12-22 13:25:13  IST  )

పుష్ప-2 ప్రీమియర్ షో(Pushpa-2 Premiere Show) సందర్భంగా సంధ్య థియేటర్లో(Sandhya Theater) జరిగిన తొక్కిసలాట ఘటనపై అసెంబ్లీ(Assembly Sessions) వేదికగా శనివారం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

Sandhya Theater Incident : ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు : బన్నీకి ఏసీపీ మాస్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్ : పుష్ప-2 ప్రీమియర్ షో(Pushpa-2 Premiere Show) సందర్భంగా సంధ్య థియేటర్లో(Sandhya Theater) జరిగిన తొక్కిసలాట ఘటనపై అసెంబ్లీ(Assembly Sessions) వేదికగా శనివారం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై అల్లు అర్జున్(Allu Arjun) మీడియా సమావేశం నిర్వహించి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారని అన్నారు. పోలీసుల సహాయంతోనే తాను థియేటర్ లోపలికి వెళ్లానని, ఎలాంటి రోడ్ షో చేయలేదని వెల్లడించారు.

తాజాగా ఈ వ్యవహారంలో ఏసీపీ విష్ణుమూర్తి(ACP Vishnumurthi) తీవ్రంగా స్పందించారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సంథ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ఓ రిమాండ్‌ ఖైదీ అని.. కేసు విచారణ కోర్టులో ఉండగా ముద్దాయి ప్రెస్‌మీట్‌ పెట్టొచ్చా? అని ప్రశ్నించారు. సంధ్య థియేటర్ వద్ద గ్యాదరింగ్‌ వద్ద పోలీసులు చెప్పినా అల్లు అర్జున్‌ వినలేదని ఆరోపించారు. బౌన్సర్ల తోపులాటతోనే మహిళా చనిపోయిందన్నారు. బౌన్సర్లతో దౌర్జన్యం కరెక్ట్ కాదని, పబ్లిక్ ప్లేసులలో సెలబ్రెటీలు బాధ్యతగా వ్యవహరించాలనన్నారు. పోలీసులు తమ విధులను సరిగానే వ్యవహరించారని.. పోలీసులంటే కనీస గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు. డబ్బు మదంతో పోలీసుల మీద అవాకులు చెవాకులు పేలుతున్నారని, విచారణను ప్రభావితం చేసే విధంగా మాట్లాడుతున్నారని ఏసీపీ సబ్బతి విష్ణుమూర్తి ఫైర్ అయ్యారు. అల్లు అర్జున్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.. లేదంటే తోలు తీస్తామని హెచ్చరించారు.

Read More :Sandhya Theatre incident:‘తొక్కిసలాటలో నేను చనిపోతా అనుకున్నా’.. చిక్కడపల్లి సీఐ సంచలన వ్యాఖ్యలు

Next Story