- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పేరుకుపోయిన చెత్త, పట్టించుకోని జీహెచ్ఎంసీ అధికారులు
నగరంలో ఎటు చూ సినా చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. దుర్వాసనతో జనాలు రోగా ల బారిన పడుతున్నారు.

పేరుకుపోయిన చెత్త
ఫిర్యాదు చేసినా పట్టించుకోని జీహెచ్ఎంసీ అధికారులు
రోగాల బారిన పడుతున్న ప్రజలు
దిశ, కార్వాన్ : నగరంలో ఎటు చూ సినా చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. దుర్వాసనతో జనాలు రోగా ల బారిన పడుతున్నారు. జీహె చ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చే సినా పట్టీపట్టనట్లు వ్యవహరించడం తో కింది స్థాయి సిబ్బంది మొక్కుబ డిగా పనిచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నాంపల్లి నియోజకవర్గంలోని ప్రతి డివిజన్‌లో చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. దీంతో కాలనీ లు, బస్తీల్లో ఉన్న ప్రజలకు ఇబ్బందు లు తప్పడంలేదు. జీహెచ్ఎంసీ అధికారులు ప్రతి నియోజకవర్గంలో స్పె షల్ డ్రైవ్లు నిర్వహిస్తూ సమస్యలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉం ది. సిబ్బందిని పురమాయించాల్సిన అధికారులు పట్టనట్లు వ్యవహరించడంతో మొక్కు బడిగా పనిచేస్తున్నారనే ఆరోపణలు ఉత్పన్నమవుతున్నాయి.
పేరుకపోతున్న చెత్త..
నాంపల్లిలోని ప్రతి డివిజన్‌లోని పలు బస్తీల్లో చెత్త కుప్పలు పేరుకపో వడంతో అందులో నుంచి తీవ్రమైన దుర్వాసనతో పాటు, దోమలు కూ డా సైర విహారం చేస్తున్నాయి. దీం తో స్థానికులు రోగాల బారిన పడు తూ ఆసుపత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి ఉందని ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. ఈ విష యంపై సంబంధిత జీహెచ్ఎంసీ అధికారులకు మొరపెట్టుకున్నా ప ట్టించుకునే నాథుడు కరువయ్యారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పేరుకుపోయిన చెత్తను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.






