- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మీసేవ కేంద్రాలపై ACB పంజా: నగరంలోని పలు కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు
హైదరాబాద్ నగర పరిధిలోని పలు మీసేవ కేంద్రాలపై ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేపడుతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: మీసేవ (Mee Seva) కేంద్రాల్లో జరుగుతున్న అక్రమాలపై అవినీతి నిరోధక శాఖ (ACB) కొరడా ఝుళిపించింది. ఇవాళ హైదరాబాద్ (Hyderabad)లోని పలు కీలక ప్రాంతాల్లోని మీసేవ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నగరంలోని ఖైరతాబాద్, అంబర్‌పేట్, అల్వాల్ ప్రాంతాల్లోని మీసేవ కేంద్రాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. పౌర సేవా సర్టిఫికెట్లు జారీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయన్న సమాచారంతో ఈ దాడులు జరిగినట్లుగా తెలుస్తోంది.
దళారు హవా.. అదనపు వసూళ్లు
అయితే, సాధారణ ప్రజలకు అందాల్సిన సేవలను అడ్డుకుంటూ, మీసేవ సిబ్బంది దళారుల (Brokers) ద్వారా చక్రం తిప్పుతున్నట్లుగా ఏసీబీ ప్రాథమికంగా గుర్తించింది. కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాల కోసం ప్రభుత్వం నిర్ణయించిన రుసుము కంటే ఎక్కువ మొత్తాన్ని వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దళారుల ద్వారా వచ్చే దరఖాస్తులను వెంటనే పరిష్కరిస్తూ.. ఇక నేరుగా వచ్చే సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లుగా తెలిసింది. సోదాల సమయంలో మీసేవ కార్యాలయాల్లోని నగదు నిల్వలు, దరఖాస్తుల పెండింగ్ జాబితా, సిబ్బంది వ్యక్తిగత వివరాలను ఏసీబీ బృందాలు పరిశీలించాయి. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆధారాలు లభిస్తే సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.






