Hyderabad : హైదరాబాద్‌లో ఫ్లైఓవర్ పై నుంచి దూకి యువకుడు సూసైడ్

by Muthe.Rajitha |

హైదరాబాద్‌(Hyderabad)లో ఫ్లైఓవర్ పై నుంచి దూకి ఓ యువకుడు సూసైడ్(Man Suicide) చేసుకున్నాడు.

Hyderabad : హైదరాబాద్‌లో ఫ్లైఓవర్ పై నుంచి దూకి యువకుడు సూసైడ్
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌(Hyderabad)లో ఫ్లైఓవర్ పై నుంచి దూకి ఓ యువకుడు సూసైడ్(Man Suicide) చేసుకున్నాడు. గచ్చిబౌలి పోలీసుల(Gachibouli Police) వివరాల ప్రకారం.. శ్రీకాకులానికి చెందిన ఓ యువకుడు నగరంలో పెయింటర్ గా పనిచేస్తూ.. గచ్చిబౌలిలో నివాసం ఉంటున్నాడు. కుటుంబ కలహాల కారణంగా గత కొంతకాలంగా తన సోదరి ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఈరోజు సాయంత్రం బొటానికల్ గార్డెన్ ఫ్లైఓవర్(Botanical Garden Flyover) మీది నుంచి దూకి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. తీవ్రంగా గాయపడ్డ అతన్ని స్థానికులు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.

Next Story