- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యువతి పై కత్తితో దాడి చేసిన యువకుడు
తనను కాదని ఇంకొక వ్యక్తి కి పెళ్లి చేసుకుంటుందని కక్ష పెంచుకున్నాడు. ప్రియురాలి ఇంటికి వచ్చి కత్తితో దాడికి పాల్పడ్డాడు.

దిశ, శేరిలింగంపల్లి : తనను కాదని ఇంకొక వ్యక్తి కి పెళ్లి చేసుకుంటుందని కక్ష పెంచుకున్నాడు. ప్రియురాలి ఇంటికి వచ్చి కత్తితో దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలు గురైన యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.ఈ ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెడ్డి కాలనీలో జరిగింది. ఎస్సై మౌనిక కథనం ప్రకారం యువరాలు ఈ విధంగా ఉన్నాయి. హౌస్ కీపింగ్ విధులు నిర్వహిస్తున్న నూకరత్నం స్వస్థలం కాకినాడ. ఐదు నెలల క్రితం ఉపాధి కోసం మియాపూర్ వచ్చి రెడ్డి కాలనీలో నివాసం ఉంటున్నారు. అదే ప్రాంతానికి చెందిన అలీషా అనే యువకుడు హౌస్ కీపింగ్ విధులు నిర్వహిస్తున్నాడు.గత కొంత కాలం నుంచి నూకరత్నం తో పరిచయం ఏర్పడింది. నూకరత్నం కు ఇంకొక వ్యక్తితో పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న ప్రియుడు అలీషా కత్తితో దాడికి పాల్పడడంతో తీవ్ర గాయాలు గురైన యువతి ని చికిత్స నిమిత్తం ఆసుపత్రులు తరలించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.






