లివర్‌కు నిశ్శబ్ద ముప్పు.. ముందస్తు చెకప్‌లతోనే రక్షణ

by Ratna Kumari |

మానవ శరీరానికి ‘పవర్‌హౌస్‌’గా భావించబడే కాలేయం (లివర్​) ఆరోగ్యాన్ని చాలా మంది నిర్లక్ష్యం చేయడం వల్ల అది నిశ్శబ్దంగా దెబ్బతింటూ ప్రాణాంతక స్థితులకు దారితీస్తోందని కామినేని ఆస్పత్రి వైద్యులు హెచ్చరించారు.

లివర్‌కు నిశ్శబ్ద ముప్పు.. ముందస్తు చెకప్‌లతోనే రక్షణ
X

దిశ, వనస్థలిపురం : మానవ శరీరానికి ‘పవర్‌హౌస్‌’గా భావించబడే కాలేయం (లివర్​) ఆరోగ్యాన్ని చాలా మంది నిర్లక్ష్యం చేయడం వల్ల అది నిశ్శబ్దంగా దెబ్బతింటూ ప్రాణాంతక స్థితులకు దారితీస్తోందని కామినేని ఆస్పత్రి వైద్యులు హెచ్చరించారు. ఏప్రిల్​ 19న ‘వరల్డ్​ లివర్​ డే’ను పురస్కరించుకుని శనివారం ఎల్బీనగర్​ కామినేని ఆస్పత్రిలో ‘సాలిడ్ హాబిట్స్ - సేఫ్ లివర్’ థీమ్‌తో లివర్​ ఆర్యోగంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ‘లివర్ చెకప్ ప్యాకేజీ’ని ప్రత్యేక రాయితీతో అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ ప్యాకేజీలో హెపటైటిస్ బి, సి స్క్రీనింగ్‌, లివర్ ఫంక్షన్ టెస్ట్‌, లిపిడ్ ప్రొఫైల్‌, థైరాయిడ్‌, అల్ట్రాసౌండ్‌తో పాటు నిపుణుల కన్సల్టేషన్‌లను చేర్చారు. అసలు ధర రూ.7,830 ఉండగా, ప్రస్తుతం రూ.2,999కే అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఆఫర్ ఏప్రిల్‌ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని, 18–30 ఏళ్ల వయస్సు గల వారు ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కామినేని ఆస్పత్రి సీనియర్ కన్సల్టెంట్ & లివర్ ట్రాన్స్​ప్లాంటేషన్​ నిపుణుడు డాక్టర్​ ఏవీ కృష్ణ చైతన్య మాట్లాడుతూ.. లివర్ వ్యాధులు సిరోసిస్‌, లివర్ ఫెయిల్యూర్ దశలకు చేరితే శరీరంలో ద్రవం పేరుకుపోవడం, అంతర్గత రక్తస్రావం, క్యాన్సర్ వంటి తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయని తెలిపారు. అయితే ఆధునిక వైద్య విధానాలతో మందులు, ఎండోస్కోపిక్ చికిత్సలు, అవసరమైతే లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ద్వారా మంచి ఫలితాలు సాధ్యమవుతున్నాయని పేర్కొన్నారు. అనంతరం డాక్టర్​ తేజస్విని తుమ్మ మాట్లాడుతూ.. ప్రారంభ లక్షణాలైన అలసట, కడుపు అసౌకర్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా రక్తపరీక్షలు, అల్ట్రాసౌండ్‌, ఫైబ్రోస్కాన్ వంటి పరీక్షల ద్వారా ముందుగానే గుర్తించడం అవసరమని సూచించారు. ఈ కార్యక్రమంలో డా. వీఆర్ సుమంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

Next Story