సిడ్నీలో కాల్పులు జరిపింది హైదరాబాద్ వాసి : రాష్ట్ర డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి

by Ratna Kumari |

దిశ, కార్వాన్ : సిడ్నీలోని సిడ్నీలోని బాండి బీచ్‌లో ఇద్దరు దుండగులు బహిరంగ హనుక్కా వేడుకల సమయంలో జ

సిడ్నీలో కాల్పులు జరిపింది హైదరాబాద్ వాసి : రాష్ట్ర డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి
X

దిశ, కార్వాన్ : సిడ్నీలోని సిడ్నీలోని బాండి బీచ్‌లో ఇద్దరు దుండగులు బహిరంగ హనుక్కా వేడుకల సమయంలో జరిపిన సామూహిక కాల్పుల ఘటనలో 15 మంది గాయపడ్డారు. ఇద్దరు దాడి చేసిన వారిలో ఒకరు మరణించినట్లు సమాచారం. ఈ ఘటన కు సంబంధించిన ప్రెస్ నోట్ ను రాష్ట్ర డీజీపీ శివదర్ రెడ్డి మంగళవారం విడుదల చేశారు. ఈ ఘటనను ఆస్ట్రేలియా పోలీసులు, ప్రభుత్వం ఉగ్రవాద దాడిగా పరిగణిస్తున్నారు. దాడి చేసిన వారిని సాజిద్ అక్రమ్ (50 సంవత్సరాలు) అతని కుమారుడు నవీద్ అక్రమ్ (24 సంవత్సరాలు)గా గుర్తించారు. వారు ఐసిస్ భావజాలంతో ప్రేరేపించబడ్డారని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ విషయమై ఆస్ట్రేలియా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే సాజిద్ అక్రమ్ స్వస్థలం హైదరాబాద్ లోని టోలిచౌకి ప్రాంతం నివాసి.


అతను హైదరాబాద్‌లో తన బీ.కామ్ డిగ్రీని పూర్తి చేసి, సుమారు 27 సంవత్సరాల క్రితం, 1998 నవంబర్‌లో ఉపాధి నిమిత్తం ఆస్ట్రేలియాకు వలస వెళ్ళాడు. ఆ తర్వాత అతను యూరోపియన్ సంతతికి చెందిన వెనెరా గ్రోసో మహిళ ను వివాహం చేసుకుని ఆస్ట్రేలియాలో శాశ్వతంగా స్థిరపడ్డాడు. వారికి ఒక కుమారుడు, నవీద్ (ఇద్దరు దాడి చేసిన వారిలో ఒకరు) మరియు ఒక కుమార్తె ఉన్నారు. సాజిద్ అక్రమ్ వద్ద నేటికీ భారతీయ పాస్‌పోర్ట్ ఉంది. అతని కుమారుడు నవీద్ అక్రమ్, కుమార్తె ఆస్ట్రేలియాలో జన్మించారు. అంతేకాకుండా వారు ఆస్ట్రేలియా పౌరులు. భారతదేశంలోని అతని బంధువుల నుండి అందిన సమాచారం ప్రకారం.. సాజిద్ అక్రమ్ గత 27 సంవత్సరాలుగా హైదరాబాద్‌లోని తన కుటుంబంతో పరిమిత సంబంధాలనే కలిగి ఉన్నాడు. ఆస్ట్రేలియాకు వలస వెళ్ళిన తర్వాత, అతను ప్రధానంగా ఆస్తి సంబంధిత విషయాలు మరియు వృద్ధ తల్లిదండ్రులను కలవడం వంటి కుటుంబ సంబంధిత కారణాల కోసం ఆరుసార్లు భారతదేశాన్ని సందర్శించాడు. తన తండ్రి మరణ సమయంలో కూడా అతను భారతదేశానికి రాలేదని తెలిసింది. అతని కుటుంబ సభ్యులు అతని తీవ్రవాద మనస్తత్వం లేదా కార్యకలాపాల గురించి, అతను తీవ్రవాదిగా మారడానికి దారి తీసిన పరిస్థితుల గురించి తమకు ఎలాంటి అవగాహన లేదని తెలిపారు.

Next Story