చాలా రోజుల తర్వాత కీలక పరిణామం.. హైదరాబాద్‌లో రెండు రాష్ట్రాల మంత్రుల భేటీ

by Vemula.Srinu Prasad |

హైదరాబాద్‌లో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది...

చాలా రోజుల తర్వాత కీలక పరిణామం..  హైదరాబాద్‌లో రెండు రాష్ట్రాల మంత్రుల భేటీ
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌(Hydrabad)లో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. రెండు రాష్ట్రాల మంత్రులు ఒకే వేదికపై కలవబోతున్నారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించనున్నారు. రబీ సీజన్(Rabi Season) ముగుస్తుండటంతో రైతులు పండించిన ధాన్యం, మద్దతు ధర, నిల్వ, రవాణా, మిల్లింగ్ పై దృష్టి సారించిన రెండు ప్రభుత్వాలు ఒక చోటు కూర్చుకుని చర్చించుకోవాలని నిర్ణయించాయి. ఈ మేరకు సివిల్ సప్లై మంత్రులు హైదరాబాద్ పౌరసరఫరాల కార్యాలయం(Hyderabad Civil Supplies Office)లో భేటీకి ఏర్పాటు చేశారు. ఏపీ(Ap), తెలంగాణ(Telangana)పౌరసరఫరాల మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy), నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) సమావేశం కానున్నారు. ధాన్యం, మద్దతు ధర, నిల్వ, రవాణా, మిల్లింగ్‌పై చర్చించనున్నారు. అలాగే రెండు రాష్ట్రాల మధ్య పరస్పరం సహకారంపైనా చర్చించనున్నారు.

కాగా రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్ ఎర్రమంజిల్‌లోని ఏపీఎస్‌సీఎల్ కార్యాలయాన్ని ఏపీకి కేటాయించారు. ప్రస్తుతం ఈ సేవలు విజయవాడ కేంద్రంగా జరుగుతున్నాయి. దీంతో ఈ భవనంపైనా ఇద్దరి మంత్రుల మధ్య చర్చ జరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. చూడాలి మరి.

Next Story