సోనియాగాంధీ ప‌క్షాన న్యాయ స‌మ్మ‌త‌మైన తీర్పు

by Ratna Kumari |

దిశ, హిమాయత్ నగర్ : నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో ఢిల్లీ న్యాయస్థానం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ

సోనియాగాంధీ ప‌క్షాన న్యాయ స‌మ్మ‌త‌మైన తీర్పు
X

దిశ, హిమాయత్ నగర్ : నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో ఢిల్లీ న్యాయస్థానం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పక్షాన న్యాయ సమ్మతమైన తీర్పును ఇవ్వడం భారత న్యాయవ్యవస్థ స్వతంత్రతకు నిదర్శనం అంటూ తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ట్యాంక్ బండ్ లోని డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద యువజన కాంగ్రెస్ తరపున హర్షం వ్యక్తం చేస్తూ బీజేపీ వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. జక్కిడి శివ చరణ్ రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయ ప్రతీకారంతో నిరాధార ఆరోపణలతో బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకత్వాన్ని దెబ్బతీయాలనుకోవడం సిగ్గుచేటు అన్నారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, ధరల పెరుగుదల, సామాజిక అసమానతలపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రశ్నిస్తే వాటికి సమాధానం చెప్పలేని మోడీ ప్రభుత్వం అక్రమ కేసులతో ఆయనను అణచివేయాలని చూసిందని ఆరోపించారు. కానీ న్యాయం ఎప్పుడూ సత్యం వైపే ఉంటుందని, ఈ నేషనల్ హెరాల్డ్ కేసు తీర్పే నిదర్శనం అన్నారు. న్యాయం, నిజాయితీ ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న రాహుల్ గాంధీ వెంట కాంగ్రెస్ పార్టీ వెంట యావత్ భారత దేశ ప్రజలంతా ఉంటారని స్పష్టం చేశారు. మోడీ నిరంకుశ పాలనకు త్వరలోనే దేశ ప్రజలంతా గోరి కడతారని జక్కిడి శివ చరణ్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, పలు జిల్లాల, నియోజకవర్గాల అధ్యక్షులు, యువజన కాంగ్రెస్ కార్యకర్తలు శ్రేణులు పాల్గొన్నారు.

Next Story