- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సిగరేట్ వద్ద ప్రారంభమైన వివాదం.. యువకుడు బలి
చిన్న విషయం చెలరేగిన ఘర్షణ ఓ యువకుడి ప్రాణాన్ని చిన్న విషయంపై చెలరేగిన ఘర్షణ ఒక యువకుడి ప్రాణాన్ని బలితీసుకున్న విషాద ఘటన భవానీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

దిశ, చంపాపేట్ : చిన్న విషయం చెలరేగిన ఘర్షణ ఓ యువకుడి ప్రాణాన్ని చిన్న విషయంపై చెలరేగిన ఘర్షణ ఒక యువకుడి ప్రాణాన్ని బలితీసుకున్న విషాద ఘటన భవానీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ హత్య కేసును పోలీసులు వేగంగా ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. నషేమాన్ నగర్, తలాబ్‌కట్టకు చెందిన మహ్మద్ ముదస్సిర్ (19) ఈ కేసులో నిందితుడు. మృతుడు సయ్యద్ అబ్దుల్ ఖాదిర్ అలీ (21), షాహీన్ నగర్, బాలాపూర్‌కు చెందినవాడు. అతను ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో పని చేస్తూ ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 11న కుటుంబంలో మరణం సంభవించడంతో కుటుంబ సభ్యులు భవానీనగర్‌కు వచ్చారు. 13న సాయంత్రం సమాధి వద్దకు వెళ్లేందుకు ఆటో తీసుకురావాలని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన అబ్దుల్ ఖాదిర్ అలీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.
కొంతసేపటి తరువాత తలా మస్జిద్ సమీపంలో అతను గాయాలతో పడివున్నట్లు సమాచారం అందడంతో వెంటనే ఉరూజ్ ఆసుపత్రికి తరలించారు. అయితే తీవ్ర అంతర్గత గాయాల కారణంగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం, పాన్ షాప్ వద్ద సిగరెట్ తాగుతున్న సమయంలో నిందితుడు మరియు మృతుడి మధ్య చూపుల మార్పిడి కారణంగా వాగ్వాదం చెలరేగింది. కోపోద్రిక్తుడైన నిందితుడు మృతుడిపై ఛాతీ, మెడ, తలపై ముష్టి దెబ్బలు కురిపించి నేలకేసి కొట్టాడు. ఈ దాడిలో అతనికి తీవ్రమైన అంతర్గత గాయాలు ఏర్పడి చివరకు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన భవానీనగర్ పోలీసులు, విశ్వసనీయ సమాచారం ఆధారంగా 16న నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. డీసీపీ చార్మినార్ జోన్ ఖరే కిరణ్ ప్రభాకర్ ఐపీఎస్ పర్యవేక్షణలో, ఏసీపీ మిర్‌చౌక్ డివిజన్ జి. శ్యామ్ సుందర్ మార్గదర్శకత్వంలో, భవానీనగర్ ఇన్‌స్పెక్టర్ ఎన్. కరుణ కుమార్, ఎస్ఐలు బి. పోచయ్య, జి. శ్రీకాంత్ ఈ కేసును వేగంగా ఛేదించారు. చిన్న చిన్న వివాదాలు ఎంత పెద్ద విషాదాలకు దారితీస్తాయో ఈ ఘటన మరోసారి స్పష్టం చేస్తోంది.






