మ‌హిళ‌ను మోసం చేసిన వ్య‌క్తి పై కేసు న‌మోదు

by Ratna Kumari |

పెళ్లి పేరుతో మహిళను గర్భవతిని చేసి అబార్షన్ చేయించిన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

మ‌హిళ‌ను మోసం చేసిన వ్య‌క్తి పై కేసు న‌మోదు
X

దిశ‌, ఉప్ప‌ల్ : పెళ్లి పేరుతో మహిళను గర్భవతిని చేసి అబార్షన్ చేయించిన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రామంతాపూర్ కు చెందిన ఒక మహిళ(34) భర్తతో విడాకులు తీసుకొని విడిగా ఉంటోంది. ఆమెకు కుమారుడు(13) ఉన్నాడు. వరంగల్ కు చెందిన సుమన్(40) పెళ్లి పేరుతో మహిళను నమ్మించి శారీరకంగా దగ్గరయ్యాడు. గర్భం దాల్చిన తర్వాత బలవంతంగా అబార్షన్ చేయించి పెళ్లి కి నిరాకరించాడు. దీంతో మోసపోయానని బాధితురాలు ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story