- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నకిలీ పత్రాలతో 73 లక్షల రుణం
నకిలీ పత్రాలను సృష్టించి లక్షలాది రూపాయాలు పొందడంతో పాటు ఆ పత్రాలతోనే కోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేసి స్థల యజమానులను భయబ్రాంతులకు గురి చేసిన నలుగురిని కీసర పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.

దిశ, సిటీక్రైం : నకిలీ పత్రాలను సృష్టించి లక్షలాది రూపాయాలు పొందడంతో పాటు ఆ పత్రాలతోనే కోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేసి స్థల యజమానులను భయబ్రాంతులకు గురి చేసిన నలుగురిని కీసర పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కీసర పోలీసు స్టేషన్ పరిధిలోని రాంపల్లి గ్రామంలో సర్వే నెంబరు 385 లోని స్థలంలోకి అక్రమంగా చొరబడి సీసీ కెమెరాలు, ప్రహారీ గోడను కూల్చివేసి యజమానులను భయబ్రాంతులకు గురి చేశారు. ఈ సంఘటన పై స్థల యజమాని రేఖా రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో రాంపల్లి ప్రాంతానికి చెందిన సుబ్బారెడ్డి రుణం కావాలని ఏజెంట్ శ్రీధర్ రెడ్డిని సంప్రదించాడు. పత్రాలు ఉంటే రుణం చేయిస్తానని శ్రీధర్ రెడ్డి చెప్పి నకిలీ పత్రాల కోసం రవిని సంప్రదించాలని సూచించాడు. దీంతో సుబ్బారెడ్డి, రవి, వెంకటేష లతో కలిసి గతంలో ఈ సర్వేనెంబరులో స్థలం ఉండి అమ్ముకున్న జమ్మల నగేష్ ను సంప్రదించారు.
తాజాగా నగేష్ కు స్థలం లేకపోయిన అతని స్థానంలో మరొకరిని పెట్టి 1500 గజాలకు నకిలీ పత్రాలను తయారు చేశారు. దీని కోసం కీసర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పని చేసే కొంతమందితో కుమ్మక్కు అయ్యారు. ఈ నకిలీ పత్రాలతో సుబ్బారెడ్డి 73 లక్షల బ్యాంక్ రుణాన్ని పొందాడు. ఆ డబ్బును అందరూ పంచుకున్నారు. ఈ స్థలానికి ధర పెరగడంతో సుబ్బారెడ్డి నకిలీ పత్రాలతో మరికొంత మందికి అగ్రిమెంట్ లు చేసి స్థల యజమానులను ఇబ్బందులకు గురి చేశాడు. అంతేకాకుండా ఈ నకిలీ పత్రాలతోనే కోర్టులో అసలు యజమానుల పై కౌంటర్ పిటిషన్ ను దాఖలు చేసి పరేషాన్ చేశాడు. దర్యాప్తులో పోలీసులు నకిలీ పత్రాల కుట్రను బయటపెట్టి శుక్రవారం సుబ్బారెడ్డి, రవి, వెంకటేష్, జమ్మల నగేష్ ను అరెస్టు చేశారు. లోన్ ఏజెంట్ శ్రీధర్ రెడ్డితో పాటు ఎస్ఆర్ఓ కార్యాలయంలో సహాకరించిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ నకిలీ పత్రాల భాగోతాన్ని బయటపెట్టిన కీసర పోలీసులను మల్కాజిగిరి డీసీపీ అభినందించారు.






