- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
32 మొబైల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేత
ప్రస్తుతం నగరంలో రోజు రోజుకు మొబైల్ ఫోన్ల దొంగలు పెరిగిపోతున్నారు. ఇటీవల చాంద్రాయణ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్నటువంటి 32 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు

దిశ, చంపాపేట్ : ప్రస్తుతం నగరంలో రోజు రోజుకు మొబైల్ ఫోన్ల దొంగలు పెరిగిపోతున్నారు. ఇటీవల చాంద్రాయణ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్నటువంటి 32 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు. చాంద్రాయణగుట్ట పోలీసులు. తాజాగా చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ లో విలేకర్ల సమావేశంలో వివరాలను ఏసీపీ సుధాకర్ వెల్లడించారు. ముఖ్యంగా స్టేషన్ హూస్ ఆఫీసర్ (SHO), డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ (DI) పర్యవేక్షణలో ఈ కేసులను ఛేదించినట్టు తెలిపారు. బాధితులు సీఈఐఆర్(సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) పోర్టల్ ద్వారా ఫిర్యాదులు నమోదు చేయడం వల్ల మొబైల్ ఫోన్లను ట్రాక్ చేసి త్వరగా రికవరీ చేయడం సాధ్యమైందని ఆయన వివరించారు. మొబైల్ ఫోన్లు తప్పు వ్యక్తుల చేతుల్లో పడితే ఆన్‌లైన్ మోసాలు, అనధికార లావాదేవీలు జరిగే ప్రమాదం ఉందని ప్రజలను ఏసీపీ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రతి పోలీస్ స్టేషన్‌లో మొబైల్ రికవరీ కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఫోన్ పోగొట్టుకున్న వెంటనే ప్రజలు భయపడకుండా, తక్షణమే సీఈఐఆర్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు. చాంద్రాయణగుట్ట పోలీసుల చర్యతో ప్రజల్లో భద్రతా నమ్మకాన్ని మరింత పెంచిందని స్థానికులు అభిప్రాయపడ్డారు.






