- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రూ. 1.20 లక్షల మద్యం పట్టివేత
మద్యం ధరలు తక్కువ ఉన్న రాష్ట్రాల నుంచి మద్యాన్ని గుట్టు చప్పుడు కాకుండా కొనుగోలుతో పాటు స్థానికంగా డిపెన్స్ బాటిళ్లను తక్కువ ధరలకు ఖరీదు చేసి ఏచిన్న అవకాశం లభించినా తక్కువ ధరలకు మద్యం బాటిళ్లను ఖరీదు చేసి మద్యం ప్రియులకు మాయ మాటలు చెప్పి అమ్మకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది.

దిశ, చైతన్యపురి : మద్యం ధరలు తక్కువ ఉన్న రాష్ట్రాల నుంచి మద్యాన్ని గుట్టు చప్పుడు కాకుండా కొనుగోలుతో పాటు స్థానికంగా డిపెన్స్ బాటిళ్లను తక్కువ ధరలకు ఖరీదు చేసి ఏచిన్న అవకాశం లభించినా తక్కువ ధరలకు మద్యం బాటిళ్లను ఖరీదు చేసి మద్యం ప్రియులకు మాయ మాటలు చెప్పి అమ్మకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. తన స్వంత ఇంట్లో అన్ని రాష్ట్రాలకు చెందిన మద్యం బాటిల్లతో చిన్నపాటి మద్యం దుకాణాన్ని తలపించే రీతిలో 24/7 అమ్మకాలు జరుపుతున్న మద్యం రాకెట్‌ను రంగారెడ్డి జిల్లా ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్ గుట్టురట్టు చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. సరూర్‌నగర్ మన్సూరాబాద్‌లో నివసించే అక్షయ్ కుమార్(30) తన ఇంట్లో నాన్ డ్యూటి పెయిడ్ లిక్కర్ అమ్మకాలు సాగిస్తున్నాడనే సమాచారం మేరకు రంగారెడ్డి ఏఈఎస్ జీవన్ కిరణ్‌తోపాటు ఎన్‌ఫొర్స్‌మెంట్ సీఐ బాలరాజు, ఎస్సై రవి సిబ్బంది కలిసి మంగళవారం దాడులు నిర్వహించారు.
ఈదాడిలో అక్షయ్ కుమార్ ఇంట్లో 45 నాన్ డ్యూటి పెయిడ్ లిక్కర్‌ను స్వాధీనం చేసుకున్నారు. గోవాకు చెందిన 23 మద్యం బాటిళ్లు, ఢిల్లీ,హర్యానాకు చెందిన 8 బాటిళ్లు, 9 డ్యూటి ఫ్రీ బాటిళ్లు , 5 తెలంగాణకు చెందిన బాటిళ్లు, ఒకటి పంజాబ్‌కు చెందిన బాటిళ్లను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్ మెంట్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న మద్యం బాటిళ్ల విలువ రూ. 1.20 లక్షల మేరకు ఉంటుందని ఏఈఎస్ జీవన్ కిరణ్ తెలిపారు. ఏడాదిగా ఫోటోగ్రఫీ పేరుతో పలు ప్రాంతాలకు వెళ్లి వస్తూ మద్యం బాటిళ్లను తీసుకు వచ్చి హైదరాబాద్‌లో అమ్మకాలు సాగిస్తున్నట్లు విచారణలో వెల్లడయ్యింది. మద్యం బాటిళ్లను పట్టుకున్న రంగారెడ్డి ఎన్‌ఫొర్స్‌మెంట్ టీమ్‌ను ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం, రంగారెడ్డి జిల్లా డిప్యూటి కమిషనర్ పి. దశరథ్, అసిస్టెంట్ కమిషనర్ ఆర్. కిషన్‌లు అభినందించారు.






