అయోమయంలో పదవతరగతి విద్యార్థులు

by Ajay Maddhiboyina |

ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు పూర్తి కావస్తున్నది. పదో తరగతి బోర్డు పరీక్షల విధానంపై ఇంకా విద్యాశాఖ

అయోమయంలో పదవతరగతి విద్యార్థులు
X

దిశ: చంపాపేట్: ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు పూర్తి కావస్తున్నది. పదో తరగతి బోర్డు పరీక్షల విధానంపై ఇంకా విద్యాశాఖ నుంచి స్పష్టత లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర అయోమయంలో ఉన్నారు. ఇంటర్నల్ మార్కుల రద్దుపై ప్రకటన వెలువడినా వందమార్కుల పేపర్ ప్యాటర్న్ పై ఇంత వరకు ఎలాంటి మార్గదర్శకాలు విడుదల కాలేదు.

ఇంటర్నర్ కు 20 మార్కులు..

ఇప్పటి వరకు ఒక్కో పేపర్ 100 మార్కులు ఉండేవి. ఇందులో 80 మార్కులు బోర్డు పరీక్షలకు, 20 మార్కులు అంతర్గత మూల్యాంకనానికి (ఇంటర్నల్స్) కేటాయించబడేవి. అయితే ఈ సంవత్సరం నుంచి ఇంటర్నల్ మార్కులు రద్దు చేసినట్లు విద్యాశాఖ ప్రకటించింది. కానీ, 100 మార్కుల పూర్తి పేపర్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుందో ఇప్పటివరకు ఎలాంటి అధికారిక మార్గదర్శకాలు విడుదల చేయలేదు. దీంతో విద్యార్థులు ఏ విధంగా సిద్ధమవ్వాలో తెలియక అయోమయంలో ఉన్నారు. పాఠశాలలు కూడా స్పష్టమైన సమాచారం లేక గందరగోళంగా సాగుతున్నాయి. ముఖ్యంగా పేపర్‌లో ఆబ్జెక్టివ్లీ ఎన్ని ప్రశ్నలు? సెక్షన్ వైజ్ ఎలా వస్తాయన్నదానిపై పూర్తి అవగాహన లేకపోవడం విద్యార్థులను తీవ్ర ఒత్తిడికి దారి తీస్తోంది. త్వరితగతిన ఈ సంవత్సరం పరీక్షా విధానంపై స్పష్టతనిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేయాలని విద్యార్థులు విద్యాశాఖను కోరుతున్నారు.

Next Story