- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ సమస్యతో ఇబ్బంది పడుతున్న హైదరాబాద్ యువత.. 58.3 శాతం మందికి అదే బాధ
మనసు మాసిపోతే మనిషే కాదని... అన్నాడో సినీ కవి. ప్రేమ విషయంలో మానసిక వేదన తీవ్రతను తెలుపుతూ రాశాడు కావొచ్చు.

మనసు మాసిపోతే మనిషే కాదని... అన్నాడో సినీ కవి. ప్రేమ విషయంలో మానసిక వేదన తీవ్రతను తెలుపుతూ రాశాడు కావొచ్చు. అయితే తాజాగా హైదరాబాద్ నగరంలోనూ ప్రజల మనసు ఏమాత్రం బాగోలేదని తేలింది. ముఖ్యంగా యువత తీవ్ర మానసిక సమస్యలతో సతమతమవుతున్నట్టు వెల్లడికావడం ఆందోళన కలిగిస్తోంది. అంతర్జాతీయ సంస్థ సపియన్ ల్యాబ్స్ నిర్వహించిన అధ్యయనంలో ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి. మెంటల్ స్టేట్ ఆఫ్ ది వరల్డ్ పేరుతో విడుదల చేసిన ఈ రిపోర్టు.. ప్రపంచవ్యాప్తంగా మానసిక ఆరోగ్య సూచీల్లో హైదరాబాద్ నగరం వెనబడినట్లు స్పష్టం చేసింది. ఆ నివేధిక పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. వాటి గురించి తెలుసుకోవాలని ఉందా..? అయితే ఈ లింక్ ఓపెన్ చేసి పూర్తిగా చూసేయండి.
కశ్మీర్లో ఉగ్రదాడి ఘటనలో పదుల సంఖ్యలో పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడంతో దేశవ్యాప్తంగా నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. ప్రముఖ నగరాలు, ప్రసిద్ధఆలయాల వద్ద సోదాలు విస్తృతమయ్యాయి. ఈ నేపథ్యంలో విజయవాడలో కొందరికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనే సమాచారంతో కలకలం రేగింది. నిషేదిత స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) ఉగ్రవాద సంస్థతో సంబంధాలు కలిగిన వారు బెజవాడలో ఉంటున్నట్లు నిఘా వర్గాలు గుర్తించినట్లు తెలుస్తోంది. వీరు విజయవాడలో షెల్టర్ ఏర్పాటు చేసుకుని ఉంటున్నారని కొద్ది రోజుల కిందట స్థానిక పోలీసులకు నిఘా వర్గాలు సమాచారం అందించినట్టు తెలిసింది. ప్రస్తుతం విజయవాడలో ఎంత మంది సిమి సభ్యులు ఉన్నారు..? ఎక్కడెక్కడ ఉన్నారు..? ఏఏ వేషాలతో ఉన్నారో తెలుసుకోవాలంటే ఈ లింక్‌ను క్లిక్ చేయండి.
జమ్మూకశ్మీర్‌లోని పహెల్గాం ఉగ్రదాడితో భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇలాంటి సమయంలో పాక్ మరోసారి తన దుర్బుద్ధిని బయటపెట్టింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. నియంత్రణ రేఖ వెంబడి భారతసైనిక స్థావరాలపై పాక్ కాల్పులకు పాల్పడింది. దాయాది దాడిని భారత ఆర్మీ సమర్థంగా ఎదుర్కొంటుంది. శత్రువుల కాల్పులకు దీటుగా బదులిస్తోంది. నలుగురు పాక్ సైనికులు మృతి చెందినట్లు సమాచారం. దీంతో రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైందా..? అనే చర్చ జరుగుతున్నది. అయితే, అర్ధరాత్రి నుంచే కాల్పులు జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని.. ఎవరికీ గాయాలు కాలేదని ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఈ దుశ్చర్యలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ లింక్ లో చూడండి.
పెట్టుబడులు, న్యాయం, ప్రపంచ శాంతి, అహింస లక్ష్యంగా ఇవాళ్టి నుంచి రెండురోజుల పాటు జరగనున్న భారత్ సమ్మిట్ -2025 ప్రారంభమైంది. హైదరాబాద్ హెచ్ఐసీసీ నోవాటెల్‌లో జరుగుతున్న సమ్మిట్‌కు 100 దేశాల నుంచి దాదాపు 450మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించే విధంగా బోనాలు, డబ్బులతో వారికి కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సమ్మిట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఈ లింక్ ఓపెన్ చేసి తెలుసుకోండి.






