- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరో ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌కు హైదరాబాద్ ఆతిథ్యం.. ఈ నెల నుంచి హాకీ వరల్డ్ క్వాలిఫైయింగ్ టోర్నమెంట్
క్రీడా రంగంలో దేశంలో పేరుగాంచిన హైదరాబాద్‌లో మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ క్రీడా వేడుకకు వేదిక కానుంది.

దిశ, తెలంగాణ బ్యూరో: క్రీడా రంగంలో దేశంలో పేరుగాంచిన హైదరాబాద్‌లో మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ క్రీడా వేడుకకు వేదిక కానుంది. ఫేడరేషన్ ఇంటర్నేషనల్ దీ హకీ (ఎఫ్ఐహెచ్) ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ 2026 టోర్నమెంట్‌ను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో క్రీడాశాఖ ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్‌ను అత్యున్నత ప్రమాణాలతో నిర్వహించేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించారు. మార్చి 8 నుంచి 14 వరకు మహిళల హాకీ వరల్డ్ క్వాలిఫైయింగ్ టోర్నమెంట్ జరగనుంది. ఈ మెగా ఈవెంట్‌కు గచ్చిబౌలి హాకీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ క్వాలిఫయర్స్‌లో భారత్, ఆస్ట్రియా, ఇంగ్లాండ్, ఇటలీ, కొరియా, స్కాట్లాండ్, ఉరుగ్వే, వేల్స్ దేశాలకు చెందిన ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి.
2026 మహిళల హాకీ వరల్డ్ కప్‌కు అర్హత
ఈ టోర్నమెంట్ 2026 మహిళల హాకీ వరల్డ్ కప్‌కు అర్హత సాధించేందుకు కీలక పాత్ర పోషించనుంది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఎటువంటి లోపాలు లేకుండా అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. హాకీ ఇండియా, ఎఫ్ఐహెచ్ ప్రతినిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వంలోని పలు శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఈ టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. భారత జట్టు, ఇంగ్లాండ్, స్కాట్లాండ్, ఉరుగ్వే జట్లు ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకున్నాయి. ఈ టోర్నమెంట్ సందర్భంగా నగరానికి విచ్చేసే క్రీడాకారులు, అంతర్జాతీయ ప్రతినిధుల కోసం ప్రత్యేక వారసత్వ పర్యటనలు, వినోద కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. తెలంగాణ సంస్కృతి, వారసత్వాన్ని పరిచయం చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమాలు రూపొందించారు. మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ 2026 నిర్వహణతో హైదరాబాద్ మరోసారి ప్రపంచ స్థాయిలో నిలవనుంది.






