మేము ఇద్దరం కాదు ఆరుగురం.. టిఫిన్ బాక్స్ బాంబుల తయారీ కోణం కలకలం..

by Bhanu |

హైదరాబాద్ లో టిఫిన్ బాంబులను పేల్చాలని ఐసిస్ సానుభూతిపరులు కుట్రపన్నారా....దీని కోసం ఉగ్రవాద స్లీపర్ సెల్స్ నగరంలో 3 రోజుల పాటు తిష్ట వేశారా...

మేము ఇద్దరం కాదు ఆరుగురం..  టిఫిన్ బాక్స్ బాంబుల తయారీ కోణం కలకలం..
X

దిశ, సిటీక్రైం : హైదరాబాద్ లో టిఫిన్ బాంబులను పేల్చాలని ఐసిస్ సానుభూతిపరులు కుట్రపన్నారా....దీని కోసం ఉగ్రవాద స్లీపర్ సెల్స్ నగరంలో 3 రోజుల పాటు తిష్ట వేశారా...ఇక్కడ ఓ ఇంట్లో రహస్యంగా భేటీ అయ్యారా అనే అనుమానాలకు ఆంధ్రప్రదేశ్ , హైదరాబాద్ లో పట్టబడిన ఇద్దరీ అరెస్టు కు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో నమోదైన విషయాలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. సోమవారం ఏపీ విజయనగరం పోలీసులు సయ్యద్ ఉర్ రహ్మాన్, సమీర్ లను రిమాండ్ కోసం కోర్టులో హాజరుపర్చారు. ఈ నేపధ్యంలో ప్రాధమికంగా విచారణ లో ఇద్దరు ఉగ్రవాద సానుభూతిపరులు చాలా ఆసక్తికరమైన విషయాలను వెల్లడించినట్లు సమాచారం. ఈ ఇద్దరు కాకుండా వీరితో మరో నలుగురు ఉన్నారనే విషయాన్ని తెలిపారు. అంతే కాకండు సౌడీ లోని ఐసిస్ కు చెందిన హ్యాండిలర్స్ ఇచ్చే ఆదేశాలను సారంగా పేలుళ్లకు ప్లాన్ చేసినట్లు పోలీసులకు చెప్పినట్లు సమాచారం . ఈ నేపధ్యంలో సిరాజ్ ఉర్ రహ్మాన్ , సమీర్ లతో కలిసి మొత్తం ఆరుగురు హైదరాబాద్ లో మకాం వేసినట్లు బయటపడింది. సౌదీలోని ఐసిస్ ఉగ్రవాద్ హ్యాండిలర్స్ తో మాట్లాడేందుకు ఇన్ స్టాగ్రాంలో ఓ గ్రూపును ఏర్పాటు చేసుకున్నట్లు తెలిసింది.


టిఫిన్ బాక్సు బాంబుల తయారీ కోసం సిరాజ్ ఆమెజాన్ లో కొన్ని స్టీల్ టిఫిన్ బాక్సులను ఆర్డర్ చేసి తెప్పించుకున్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నట్లు సమాచారం. అంతేకాకుండా సిరాజ్ ను అరెస్టు చేసే విజయనగరంలోని అతని ఇంటి నుంచి అమ్మోనియం నైట్రేట్, సల్ఫర్ , అమ్మోనియం పౌడర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సిరాజ్ , సమీర్ లు టిఫిన్ బాక్సు బాంబులను తయారు చేయాలని ఐసిస్ హ్యాండిలర్స్ ఆదేశించగా, మరో నలుగురిని బాంబులను పెట్టేందుకు పని చేయాలని ఆదేశించినట్లు పోలీసుల ప్రాధమిక విచారణలో తెలిసింది. ఏపీ, తెలంగాణ, ఎన్ఐఏ అధికారులు అప్రమత్తంగా ఉండడంతో ఈ టిఫిన్ బాక్స్ బాంబుల కుట్ర భగ్నం అయ్యింది. నిందితులు ఇచ్చిన ప్రాధమిక సమాచారంతో పోలీసులు, ఎన్ఐఏ అధికారులు మిగతా నలుగురు కోసం గాలిస్తున్నారు, వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తే బాంబులు ఎక్కడెక్కడ పెట్టాలని రెక్కీ చేసిన విషయంతో పాటు ఇంకా అనేక కీలకమైన విషయాలు పోలీసులకు చిక్కే అవకాశం ఉంది. ఈ ఇద్దర్నీ మరోసారి కోర్టు అనుమతితో ఏపీ పోలీసులు కస్టడీలోకి తీసుకుని ఈ బాంబు పేలుళ్ల కుట్ర వెనకాల ఇంకా ఎంత మంది ఉన్నారనే రహస్యాన్ని పోలీసులు చేధించనున్నారు. ఈ కేసు దర్యాప్తు దేశ భద్రతకు ముడిపడి ఉండడంతో దర్యాప్తు అంశాలను పోలీసు అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. అధికారికంగా వివరాలను ధ్రువీకరించడం లేదు.



Next Story