- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్ పబ్‌లలో డ్రగ్స్ కలకలం.. మల్నాడు రెస్టారెంట్ యజమాని అరెస్ట్‌తో సంచలనం
హైదరాబాద్ లో ఓ సంపన్న విద్యావంతుల డ్రగ్స్ రాకెట్ ను ఈగిల్ పోలీసులు బుధవారం బయటపెట్టారు.

దిశ, సిటీక్రైం : హైదరాబాద్ లో ఓ సంపన్న విద్యావంతుల డ్రగ్స్ రాకెట్ ను ఈగిల్ పోలీసులు బుధవారం బయటపెట్టారు. నైజీరియన్ డ్రగ్స్ ముఠాలతో పాటు మరికొంత మంది నుంచి కొకైన్, ఎక్సటసీ పిల్స్ తదితర డ్రగ్స్ ను కొంటున్నట్లు దర్యాప్తులో ఈగిల్ పోలీసులు గుర్తించారు. ఈగిల్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం...కొంపల్లి ప్రాంతంలో మల్నాడు కిచెన్ రెస్టారెంట్ ను నిర్వహిస్తున్న సూర్య అన్నమేనని తన స్కార్పియో వాహనంలో డ్రగ్స్ తీసుకువెళ్తున్నట్లు సమాచారం రావడంతో అతని కారులో తనిఖీలు చేశారు. అందులో 10 గ్రాముల కొకైన్, 3.20 గ్రాముల ఓజీ కుష్ గంజాయి, 1.6 ఎక్సటసీ పిల్స్ దొరికాయి. విచారణలో ఈ డ్రగ్స్ ను సూర్య నగరంలోని ప్రిజమ్ పబ్ , ఫాం పబ్, బర్డ్ బాక్స్, బ్రాడ్ వే, క్వేక్, క్సోరా పబ్ లు , రెస్టారెంట్ లలో సేవిస్తున్నట్లు వెల్లడించాడు.
2021 నుంచి 2025 వరకు సూర్య దాదాపు 20 సార్లు ఈ డ్రగ్స్ ను నైజీరియన్ దేశానికి చెందిన డ్రగ్స్ సరఫరాదారులు డెజ్ మండ్, స్టాన్లీ, ప్రిన్స్, నిక్ , జెర్రిలతో పాటు హిమాయత్ నగర్ కు చెందిన హర్ష, కరీంనగర్ కు చెందిన సందీప్ జువ్వాడి, ఖాజాగూడ చెందిన పల్లేపాక మోహన్ ల నుంచి కొనగొలు చేసినట్లు తెలిపాడు. అదే విధంగా చాలా సార్లు స్నేహితులతో కలిసి గోవా, బెంగళూరుకు వెళ్ళి అక్కడి నైజీరియన్ సరఫరాదారులతో పాటు ఇంకా ఇతరుల నుంచి డ్రగ్స్ కొనుగొలు చేసి సేవించినట్లు చెప్పాడు. తాజాగా వెర్రి బ్రాండ్ లేడీస్ చెప్పుల పేరుతో ఆర్డర్ ను బుక్ చేసుకుని చెప్పు హీల్స్ కింది భాగంలో వాటిని పెట్టి కొరియర్ ద్వారా ఫాతిమా పేరు మీద డ్రగ్స్ ను తెప్పించుకున్నట్లు సూర్య ఈగిల్ పోలీసులకు తెలిపాడు.
తన నెట్ వర్క్ లో జిమ్ నిర్వాహకులు, టెకీలు, డాక్టర్ లు, పబ్ డైరెక్టర్ లు ఉన్నట్లు ఈగిల్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ డ్రగ్స్ కొనుగొలుకు సంబంధించి మొత్తం ఆర్ధిక లావాదేవిలను ఆన్ లైన్ లో నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. సూర్య ను అరెస్టు చేసి అతని నుంచి కొకైన్, ఓజీ కుష్ గంజాయి, ఎక్సటసీ పిల్స్ డ్రగ్స్, స్కార్పియో కారును స్వాధీనం చేసుకున్నారు. పబ్ లతో ఇతర ప్రముఖుల సమాచారానికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతుందని ఈగిల్ డైరక్టర్ సందీప్ శాండిల్య తెలిపారు. డ్రగ్స్ కు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే 1908 కు ఫోన్ చేయాలని డైరెక్టర్ కోరారు.






