HYD: జర్నలిస్టులకు బిగ్ అలర్ట్.. ప్రెస్ క్లబ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల

by Gantepaka Srikanth |

హైదరాబాద్ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ 2025–27 ఎన్నుకునేందుకు అక్టోబర్ 26వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు.

HYD: జర్నలిస్టులకు బిగ్ అలర్ట్.. ప్రెస్ క్లబ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ 2025–27 ఎన్నుకునేందుకు అక్టోబర్ 26వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 5గంటల వరకు పోలింగ్ జరుగుతుందని హైదరాబాద్ ప్రెస్ కబ్ల్ జనరల్ సెక్రటరీ రవికాంత్ రెడ్డి సోమవారం ప్రకటనలో తెలిపారు. దొడ్డ శ్రీనివాస్ రెడ్డి ఎన్నికలను రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించనున్నారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష(జనరల్), ఉపాధ్యక్ష (ఉమెన్), ప్రధాన కార్యదర్శి, సంయుక్త కార్యదర్శులు(2), ట్రెజరర్, కార్యనిర్వహక సభ్యలు(10) ఎన్నిక నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జర్నలిస్ట్ ఓటర్ల జాబితాలో అభ్యంతరాలు ఉంటే అక్టోబర్ 9వ తేదీవరకు తెలపాలని పేర్కొన్నారు. నామినేషన్ ఫారంల ప్రక్రియ అక్టోబర్ 12, 13 తేదీలలో, నామినేషన్ల స్వీకరణ అక్టోబర్ 14, 15 తేదీలలో ఉంటుందని తెలిపారు. అత్యవసర పరిస్థితిలలో పోలింగ్ సాయంత్రం 6గంటల వరకు కొనసాగుందని పేర్కొన్నారు.

Next Story